<font face="mangal" size="3px">బ్యాంక్ అఫ్ బరోడా మరియు ఇండియన్ బ్యాంక్ లపై & - ఆర్బిఐ - Reserve Bank of India
బ్యాంక్ అఫ్ బరోడా మరియు ఇండియన్ బ్యాంక్ లపై భారతీయ రిజర్వు బ్యాంకు నగదు జరిమానా విధింపు.
నవంబర్ 20, 2019 బ్యాంక్ అఫ్ బరోడా మరియు ఇండియన్ బ్యాంక్ లపై భారతీయ ఖాతాచెల్లింపుదారు చెక్కులను (అకౌంటు పేయీ చెక్కులు) సేకరించడం, మోసపూరిత కార్యకలాపాల రిపోర్టింగ్, సేవింగ్స్ బ్యాంక్ (యస్ బి) ఖాతాలను తెరవడం, ఖాతాదార్ల గుర్తింపునకు సంబంధించిన దస్త్రాలను భద్రపరచడం మరియు ‘మీ వినియోగదార్లను తెలుసుకోండి (కెవైసి)’/’అక్రమ-నగదు చలామణి (ఏయంయల్)’ నిబంధనల మీద ఆర్‌బిఐ ద్వారా జారీచేయబడిన నిబంధనలను పాటించనందులకు నవంబర్ 18, 2019 తారీఖునాటి తమ ఉత్తర్వు ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా పై మరియు సేవింగ్స్ బ్యాంక్ (యస్ బి) ఖాతాలను తెరవడం మరియు కెవైసి/ఏయంయల్ నిబంధనలను పాటించనందులకు నవంబర్ 18, 2019 తారీఖునాటి ఉత్తర్వు ద్వారా ఇండియన్ బ్యాంక్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ఈ క్రిందివిధంగా నగదు జరిమానా విధించింది:
ఈ జరిమానాలను, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 51(1) తో కలిపి సెక్షన్ 47ఏ(1)(సి) క్రింద తమకు సంక్రమించిన అధికారాలతో పైన ఉటంకించిన ఆర్బీఐ ఆదేశాలను బ్యాంకులు అనుసరించకపోవడాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ విధించడం జరిగింది. ఈ చర్యను, నియంత్రణలు పాటించడంలో లోపాల మూలంగా మాత్రమే తీసుకోబడిoదితప్ప, వారి ఖాతాదార్లతో జరిపిన ఏ లావాదేవీ లేదా ఒప్పందాల చెల్లుబడి మీద తీర్మానం చెప్పినట్లుగా భావింపరాదు. నేపథ్యం బ్యాంకులచే నిర్వహింపబడుతున్న ఒక కో-ఆపరేటివ్ సొసైటీ వివిధ ఖాతాల మాధ్యమం ద్వారా వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు/శాఖల ఖాతాలనుండి నిధుల దుర్వినియోగం మరియు మోసపూరితంగా నిధుల ఉపసంహరణ గురించి పొందిన కొన్ని ఫిర్యాదుల ఆధారంగా ఆర్బిఐ నిర్వహించిన నిశితపరిశీలనలో, మిగతా విషయాలతో పాటు; ఖాతాచెల్లింపుదారు చెక్కులను (అకౌంటు పేయీ చెక్కులు) సేకరించడం, మోసపూరిత కార్యకలాపాల రిపోర్టింగ్, సేవింగ్స్ బ్యాంక్ (యస్ బి) ఖాతాలను తెరవడం, ఖాతాదార్ల గుర్తింపునకు సంబంధించిన దస్త్రాలను భద్రపరచడం మరియు కెవైసి/ఏయంయల్ నిబంధనల మీద ఆర్‌బిఐ ద్వారా జారీచేయబడిన కొన్నినిబంధనలను పైన పెర్కొనబడిన బ్యాంకులు పాటించడం లేదనే విషయం బయల్పడింది. బయల్పడిన విషయాల ఆధారంతో, పైన ఉటంకించినటువంటి ఆర్బీఐ ఆదేశాలను పాటించకపోవడం మీద జరిమానా ఎందుకు విధించ కూడదని బ్యాంకులకు నోటీసులను జారీ చేయడం జరిగింది. ఈ నోటీసులకు బ్యాంకులు ఇచ్చిన సమాధానo మరియు వైయక్తిక విచారణ లో సమర్పించిన మౌఖిక విన్నపాలను పరిశీలించిన తదుపరి, పైన ఉటంకించినటువంటి ఆర్బీఐ ఆదేశాల ఉల్లంఘనలు, ఆయా బ్యాంకులవారి ప్రతి ఉల్లంఘనలమేరకు, నగదు జరిమానా విధించదగినవేనని ఆర్బీఐ నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2019-2020/1233 |