<font face="mangal" size="3">కార్పొరేషన్ బ్యాంకు ఫై భారతీయ రిజర్వు బ్యాij - ఆర్బిఐ - Reserve Bank of India
కార్పొరేషన్ బ్యాంకు ఫై భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా జరిమానా విధింపు
తేది: 02/08/2019 కార్పొరేషన్ బ్యాంకు ఫై భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా జరిమానా విధింపు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) జులై 31, 2019 నాటి ఆదేశం ప్రకారం, (i) బ్యాంకుల్లో సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్ మరియు (ii) వాణిజ్య బ్యాంకుల మరియు ఎంచిన ఆర్ధిక సంస్థల ద్వారా మోసపూరిత కార్యకలాపాల వర్గీకరణ మరియు రిపోర్టింగ్ ఫై ఆర్.బి.ఐ జారీ చేసిన ఆదేశాల అనుపాలనా లోపం కొరకు, కార్పొరేషన్ బ్యాంకు ఫై ₹ 1.00Cr (ఒక కోటి రూపాయలు మాత్రమే) ఆర్ధిక జరిమానా విధించింది. ఈ జరిమానా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 46(4)(i) మరియు 51(1) తో కలిపి సెక్షన్ 47A(1)(c) క్రింద ప్రదానం చేసిన అధికారాలను వినియోగించుకొని విధించడం జరిగింది. ఈ చర్య ఆదేశాల అనుపాలనా లోపం కొరకు మాత్రమే తప్ప, వినియోగదారుల ఏ లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటు మీద అభిప్రాయ వ్యక్తీకరణ కాదు. నేపథ్యం రద్దు చేసిన డెబిట్ కార్డు ఉపయోగించి జరిపిన మోసపూరిత లావాదేవీల ఫై బ్యాంక్ సమర్పించిన సైబర్ సెక్యూరిటీ సంఘటన నివేదిక ఆధారంగా, బ్యాంకుల్లో సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్ మరియు వాణిజ్య బ్యాంకుల మరియు ఎంచిన ఆర్ధిక సంస్థల ద్వారా మోసపూరిత కార్యకలాపాల వర్గీకరణ మరియు రిపోర్టింగ్ ఫై ఆర్బిఐ జారీ చేసిన ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ విఫలమైందని వెల్లడైంది. ప్రాప్తించిన సమాచారం ఆధారంగా, ఆర్.బి.ఐ విధించిన షరతులను పాటించడంలో విఫలమైనదన్న ఆరోపణల ఫై జరిమానాఎందుకు విధించకూడదు అని బ్యాంకుకు నోటీసు జారీ చేయడం జరిగింది. బ్యాంకు ఇచ్చిన లిఖిత సమాధానం, వ్యక్తిగత విచారణలోని మౌఖిక నివేదనలు పరిగణించిన అనంతరం, ఆర్.బి.ఐ ఆదేశాలు పాటించడంలో బ్యాంకు విఫలమైనదన్న ఆరోపణలు వాస్తవమని నమ్ముతూ జరిమానా విధించాలని నిర్ధారణకు రావడం జరిగింది. యోగేష్ దయాళ్ పత్రికా ప్రకటన: 2019-2020/331 |