<font face="mangal" size="3">కార్పొరేషన్ బ్యాంక్ పై భారతీయ రిజర్వు బ్యాij - ఆర్‌బిఐ - Reserve Bank of India
కార్పొరేషన్ బ్యాంక్ పై భారతీయ రిజర్వు బ్యాంకు నగదు జరిమానా విధింపు
నవంబర్ 29, 2019 కార్పొరేషన్ బ్యాంక్ పై భారతీయ రిజర్వు బ్యాంకు నగదు జరిమానా విధింపు. ‘ఆదాయం గుర్తింపు, ఆస్తి వర్గీకరణ మరియు అడ్వాన్సులు – నిరర్ధక ఆస్తుల ఖాతాలలో అంతరo సంబంధిత కేటాయింపుల మీది ప్రూడెన్షియల్ నిబంధనలు’; ‘ఆదాయం గుర్తింపు, ఆస్తి వర్గీకరణ మరియు అడ్వాన్సులు సంబంధిత కేటాయింపులు మీద ప్రూడెన్షియల్ నిబంధనలు’; ‘బ్యాంకుల పెట్టుబడి పోర్ట్ఫోలియో వర్గీకరణ, మదింపు మరియు లావాదేవీల మీద ప్రూడెన్షియల్ నిబంధనలు’; ‘ఆర్ధికవ్యవస్థ లో ఒత్తిడికి లోనైన ఆస్తుల పునరుద్ధరణ కోసం చట్రం - సరిదిద్దడం మరియు పునర్నిర్మాణం’; ‘నిధుల వినియోగం తుట్టతుదివరకు - పర్యవేక్షణ’; ‘బ్యాంకుల ద్వారా బిల్లుల డిస్కౌంట్/రీడిస్కౌంట్’; మరియు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (వాణిజ్య బ్యాంకులు మరియు ఎంపికచేసిన ఆర్ధిక సంస్థల ద్వారా మోసపూరిత కార్యకలాపాల వర్గీకరణ మరియు రిపోర్టింగ్) నిర్దేశాలు 2016’ మీద ఆర్‌బిఐ ద్వారా జారీచేయబడిన కొన్ని నిబంధనలను పాటించనందులకు, భారతీయ రిజర్వు బ్యాంకు నవంబర్ 29, 2019 తారీఖునాటి తమ ఉత్తర్వు ద్వారా కార్పొరేషన్ బ్యాంక్ (బ్యాంక్) పై ₹ 1.50 కోట్ల నగదు జరిమానా విధించింది. ఈ జరిమానాను బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 51(1) తో కలిపి సెక్షన్ 47ఏ(1)(సి) క్రింద తమకు సంక్రమించిన అధికారాలతో ఆర్బీఐ విధించడం జరిగింది. ఈ చర్యను, నియంత్రణలు పాటించడంలో లోపాల మూలంగా మాత్రమే తీసుకోబడిoదితప్ప, వారి ఖాతాదార్లతో జరిపిన ఏ లావాదేవీ లేదా ఒప్పందాల చెల్లుబడి మీద తీర్మానం చెప్పినట్లుగా భావింపరాదు. నేపథ్యం మార్చి 31, 2017 తారీఖు నాటి బ్యాంక్ ఆర్ధిక స్థితిగతుల మీద భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా జరిపిన చట్టబద్ధమైన తనిఖీ మరియు ఇందుకుసంబంధించిన రిస్క్ అసెస్మెంట్ రిపోర్ట్ (ఆర్ఏఆర్) లో మిగతా విషయాలతో పాటు పైన ఉటంఖించిన ఆర్బీఐ ఆదేశాలను పాటించకపోవడం బయటపడ్డాయి. దీనికి అనుసరణీయంగా, పైన ఉటంకించినటువంటి ఆర్బీఐ ఆదేశాలను పాటించకపోవడం మీద జరిమానా ఎందుకు విధించ కూడదని బ్యాంక్ కు ఒక నోటీసును జారీ చేయడం జరిగింది. ఈ నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన సమాధానo, వైయక్తిక విచారణ లో సమర్పించిన మౌఖిక వినతులు మరియు అదనంగా సమర్పించిన పత్రాలను పరిశీలించిన తదుపరి, పైన ఉటంకించినటువంటి ఆర్బీఐ ఆదేశాలను పాటించకపోవడం విషయంలో బ్యాంక్ యొక్క ఉల్లంఘనలు నగదు జరిమానా విధించదగినవేనని ఆర్బీఐ నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2019-2020/1310 |