RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78520368

భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా 11 బ్యాంకుల ఫై జరిమానా విధింపు

తేది: 05/08/2019

భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా 11 బ్యాంకుల ఫై జరిమానా విధింపు

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) జులై 31, 2019 నాటి ఆదేశం ప్రకారం, క్రింద సూచించిన 11 బ్యాంకులపై ఆర్ధిక జరిమానా విధించింది. ఈ జరిమానాలు భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా, “రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (వాణిజ్య బ్యాంకుల మరియు ఎంచిన ఆర్ధిక సంస్థల ద్వారా మోసపూరిత కార్యకలాపాల వర్గీకరణ మరియు రిపోర్టింగ్) ఆదేశాలు 2016”, పాటించడంలో కొన్ని నిబంధనల అనుపాలనా లోపం కొరకు విధించబడింది.

క్రమ సంఖ్య బ్యాంకు పేరు జరిమానా
( Cr.)
1 బ్యాంకు అఫ్ బరోడా 0.5
2 కార్పొరేషన్ బ్యాంకు 0.5
3 ఫెడరల్ బ్యాంకు లిమిటెడ్ 0.5
4 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 1.0
5 జమ్మూ & కాశ్మీర్ బ్యాంకు లిమిటెడ్ 0.5
6 ఓరియంటల్ బ్యాంకు అఫ్ కామర్స్ 1.5
7 పంజాబ్ & సింధ్ బ్యాంకు 0.5
8 పంజాబ్ నేషనల్ బ్యాంకు 0.5
9 భారతీయ స్టేట్ బ్యాంకు 0.5
10 యూకో బ్యాంకు 1.0
11 యునైటెడ్ బ్యాంకు అఫ్ ఇండియా 1.0

ఈ జరిమానాలు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 51(1) తో కలిపి సెక్షన్ 47A(1)(c) క్రింద ప్రదానం చేసిన అధికారాలను వినియోగించుకొని పైన ఉదహరించిన భారతీయ రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలను/ఆదేశాలను పాటించడంలో వైఫల్యానికి విధించడం జరిగింది. ఈ చర్య అనుపాలనా లోపం కొరకు మాత్రమే తప్ప, వినియోగదారుల ఏ లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటు మీద అభిప్రాయ వ్యక్తీకరణ కాదు.

నేపథ్యం

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) క్రిమినల్ చర్యలను ప్రారంభించిన నేపథ్యంలో 'వెంటనే' ఖాతాలలో మోసపూరిత కార్యకలాపాలను నివేదించమని ఆర్బిఐ సలహా ఇచ్చినప్పటికీ, బ్యాంకులు ఆలస్యం చేశాయి/నివేదించలేదు, ఫలితంగా, ఆదేశాలను పాటించడంలో బ్యాంకులు విఫలమయ్యాయని గమనించబడింది. ఆదేశాలను పాటించడంలో విఫలమైయ్యాయన్న ఆరోపణల ఫై, జరిమానా ఎందుకు విధించకూడదు అని బ్యాంకులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. బ్యాంకులు ఇచ్చిన లిఖిత సమాధానం, కోరిన బ్యాంకుల కొరకు జరిపిన వ్యక్తిగత విచారణలోని మౌఖిక నివేదనలు మరియు అదనపు నివేదనలను (వున్న చోట) పరిగణించిన అనంతరం, ఆర్.బి.ఐ ఆదేశాలు పాటించడంలో బ్యాంకులు విఫలమయ్యాయన్న ఆరోపణలు వాస్తవమని నమ్ముతూ, ప్రతి బ్యాంకులో పాటించని పరిధి ఆధారంగా, ఫై ఆర్ధిక జరిమానాలు విధించాలని ఆర్.బి.ఐ నిర్ధారణకు రావడం జరిగింది.

యోగేష్ దయాళ్
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2019-2020/351

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?