రిజర్వ్ బ్యాంకుచే నాలుగు బ్యాంకులపై నగదు జరిమానా విధింపు
తేదీ: 13/02/2019 రిజర్వ్ బ్యాంకుచే నాలుగు బ్యాంకులపై నగదు జరిమానా విధింపు నిధుల అంతిమ వినియోగం, ఇతర బ్యాంకులతో సమాచార బదిలీ, మోసాల వర్గీకరణ మరియు నివేదిక సమర్పించుట, ఖాతాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన వివిధ మార్గదర్శకాలను పాటించని కారణంగా, జనవరి 31, 2019 తేదీన జారీచేసిన వారి ఆదేశాలద్వారా, ఈ క్రింద సూచించిన విధంగా, నాలుగు బ్యాంకులపై, రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధించినది.
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 47A (1)(c) [సెక్షన్ 46(4)(i) తో కలిపి], తమకు దఖలు పరచిన అధికారాలతో, రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన మార్గదర్శకాలు పాటించుటలో, పై బ్యాంకుల విఫలమైన కారణంగా, ఈ జరిమానాలు విధించబడ్డాయి. నిబంధనల అమలులో లోపాల కారణంగా ఈచర్య తీసుకోబడిందేతప్ప, పైబ్యాంకులు వారి ఖాతాదారులతో జరిపిన లావాదేవీలు /చేసుకొన్న ఒప్పందాల చెల్లుబాటుపై ఇది తీర్మానముకాదు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2018-2019/1930 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: