<font face="mangal" size="3">ఎచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లి., పై, రిజర్వ్ బ్యాంక్‌ న - ఆర్బిఐ - Reserve Bank of India
ఎచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లి., పై, రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధించినది
తేదీ: 18/06/2019 ఎచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లి., పై, రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధించినది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వారి ఆదేశం తేదీ జూన్ 13, 2019 ద్వారా, ఎచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లి. (బ్యాంక్) పై 10 మిలియన్ రూపాయిల, నగదు జరిమానా విధించింది. మీ వినియోగదారుని తెలుసుకోండి / ఏంటి మనీ లాండరింగ్ నిబంధనలకు (కె వై సి/ ఎ ఎమ్ ఎల్) సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన మార్గదర్శకాలు పాటించని కారణంగా, ఈ జరిమానా విధించబడింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 47A(1)(c) [సెక్షన్ 46 (4)(i) తో కలిపి], తమకు దఖలు పరచిన అధికారాలతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈజరిమానా విధించినది. నియంత్రణా మార్గదర్శకాలు పాటించుటలో లోపాలు జరిగిన కారణంగా ఈ చర్య తీసుకోబడిందేతప్ప. బ్యాంకు, ఖాతాదారులతో జరిపిన లావాదేవీలు / చేసుకున్న ఒప్పందాల చెల్లుబడిమీద, ఇది తీర్మానము కాదు. నేపథ్యం: కొందరు దిగుమతిదారులు, విదేశీ మారక ద్రవ్యం పంపించుటకు, నకిలీ బిల్స్ ఆఫ్ ఎంట్రీ (బి ఒ ఇలు) బ్యాంకుకు సమర్పించారని, కస్టమ్స్ అధికారులనుండి, రిజర్వ్ బ్యాంకుకు సమాచారం అందింది. ఈ విషయమై జరిపిన పరిశోధనలో, కె వై సి / ఏ ఎమ్ ఎల్ నిబంధనలను పాటించుటలో మరియు మోసాలను రిపోర్ట్చేయుటలో, రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలను, బ్యాంక్ ఉల్లంఘించినట్లు వెల్లడయింది. పై మార్గదర్శకాలు పాటించనందుకు, నగదు జరిమానా ఎందుకు విధించరాదో తెలపమని బ్యాంకుకు షోకాజ్ నోటీస్ (ఎస్ సి ఎన్, SCN) జారీచేయబడింది. బ్యాంక్ సమర్పించిన జవాబు, ప్రత్యక్ష సమావేశంలో చేసిన విజ్ఞాపనలు సమావేశం తరువాత చేసిన అదనపు విన్నపాలు పరిశీలించిన తరువాత, రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు పాటించలేదన్న ఆరోపణలు నిరూపించబడ్డవని, అవి జరిమానా విధింపతగినవేనని, రిజర్వ్ బ్యాంక్ నిశ్చయించింది. యోగేశ్ దయాల్ పత్రికా ప్రకటన: 2018-2019/2974 |