<font face="mangal" size="3px">ఇండియన్ బ్యాంక్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆ&# - ఆర్బిఐ - Reserve Bank of India
ఇండియన్ బ్యాంక్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా విధింపు.
నవంబర్ 20, 2019 ఇండియన్ బ్యాంక్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా విధింపు. బ్యాలెన్స్ షీట్ ను కప్పిపుచ్చిచూపడం మరియు బ్యాంక్ లో మోసపూరిత కార్యకలాపాల వర్గీకరణ మరియు వాటి నివేదిక సమర్పించడం కోసం తమచే జారీచేయబడిన వివిధ ఆదేశాలను పాటించనందులకు, ఇండియన్ బ్యాంక్ (బ్యాంక్) పై నవంబర్ 18, 2019 తారీఖునాటి ఆదేశం ప్రకారం భారతీయ రిజర్వు బ్యాంకు ₹ 1 కోటి ఆర్ధిక జరిమానా విధించింది. ఈ జరిమానాను బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 51(1) తో కలిపి సెక్షన్ 47ఏ(1)(సి) క్రింద తమకు సంక్రమించిన అధికారాలతో పైన ఉటంకించిన ఆర్బీఐ ఆదేశాలను బ్యాంక్ అనుసరించకపోవడాన్ని దృష్టిలో ఉంచుకొని విధించడం జరిగింది. ఈ చర్యను, నియంత్రణలు పాటించడంలో లోపాల మూలంగా మాత్రమే తీసుకోబడిoదితప్ప, వారి ఖాతాదార్లతో జరిపిన ఏ లావాదేవీ లేదా ఒప్పందాల చెల్లుబడి మీద తీర్మానం చెప్పినట్లుగా భావింపరాదు. నేపథ్యం మార్చి 31, 2018 తారీఖు నాటి బ్యాంక్ ఆర్ధిక స్థితిగతుల మీద భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా జరిపిన చట్టబద్ధమైన తనిఖీలో మిగతా విషయాలతో పాటు బ్యాలెన్సు షీట్ ను కప్పిపుచ్చిచూపడం, గ్యారెంటీలు మరియు ఉప-ఖరారునామాల హామీలను స్వీకరించడం, కెవైసీ నియమాలు మరియు మోసపూరిత కార్యకలాపాల వర్గీకరణ మరియు వాటి నివేదిక సమర్పించడం మీద ఆర్బీఐ ఆదేశాలను పాటించకపోవడం బయటపడ్డాయి. పైన ఉటంకించినటువంటి ఆర్బీఐ ఆదేశాలను పాటించకపోవడం మీద జరిమానా ఎందుకు విధించ కూడదని బ్యాంక్ కు ఒక నోటీసు జారీ చేయడం జరిగింది. బ్యాంక్ ఇచ్చిన సమాధానo మరియు వైయక్తిక విచారణ లో సమర్పించిన మౌఖిక వినతులను పరిశీలించిన తదుపరి, బ్యాలెన్సు షీట్ ను కప్పిపుచ్చిచూపడం మరియు మోసపూరిత కార్యకలాపాల వర్గీకరణ మరియు వాటి నివేదిక సమర్పించడం మీద ఆర్బీఐ ఆదేశాలను పాటించకపోవడం విషయంలో బ్యాంక్ యొక్క ఉల్లంఘనలు ఆర్ధిక జరిమానా విధించదగినవేనని ఆర్బీఐ నిర్ధారణకు వచ్చింది. యోగేష్ దయాళ్ పత్రికా ప్రకటన: 2019-2020/1234 |