<font face="mangal" size="3px">రిజర్వ్ బ్యాంక్‌చే, ఇండస్ఇండ్ బ్యాంక్‌ లి., ప - ఆర్బిఐ - Reserve Bank of India
రిజర్వ్ బ్యాంక్చే, ఇండస్ఇండ్ బ్యాంక్ లి., పై నగదు జరిమానా విధింపు
తేదీ: 13/12/2017 రిజర్వ్ బ్యాంక్చే, ఇండస్ఇండ్ బ్యాంక్ లి., పై నగదు జరిమానా విధింపు ఆదాయ గుర్తింపు మరియు ఆస్తుల వర్గీకరణకు (Income Recognition and Asset Classification, IRAC) సంబంధించి, ఇంకా నిధులకు జోడించని సదుపాయాలపై (non-fund based facilities, NFB) భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన మార్గదర్శకాలను ఉల్లంఘించిన కారణంగా, డిసెంబర్ 12, 2017 తేదీన, ఇండస్ఇండ్ బ్యాంక్ లి., పై రిజర్వ్ బ్యాంక్, 30 మిలియన్ రూపాయిల నగదు జరిమానా విధించినది. రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన కొన్ని ఆదేశాలు / మార్గదర్శకాలు పాటించుటలో వైఫల్యంకారణంగా, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 47 A (1)(c) [సెక్షన్ 46 (4)(1) తోకలిపి] క్రింద తమకు దఖలుపరచబడిన అధికారాలతో, ఈ జరిమానా విధించడం జరిగింది. కేవలం నిబంధనలు పాటించుటలో లోపాల కారణంగా ఈ చర్య తీసుకొనబడినది. బ్యాంకు, వినియోగదారులతో జరిపిన లావాదేవీలు లేక చేసుకొన్న ఒప్పందాల చెల్లుబాటుపై తీర్మానించుట దీని ఉద్దేశంకాదు. నేపథ్యం మార్చ్ 31, 2016 తేదీన బ్యాంక్ ఆర్థిక స్థితిపై జరిపిన తనిఖీలో, ఇతర అంశాలతోబాటు, నిరర్థక ఆస్తులు, (Non-performing Assets) మరియు NFB సదుపాయాలు కల్పించుటలో, రిజర్వ్ బ్యాంక్ జారిచేసిన నిబంధనలను ఉల్లంఘించినట్లుగా వెల్లడయింది. ఈ నివేదిక మరియు ఇతర పత్రాల ఆధారంగా, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు వారిపై చర్య ఎందుకు తీసుకొనరాదని, ఆగస్ట్ 10, 2017 తేదీన, బ్యాంకుకు నోటీస్ జారీచేయబడింది. దీనికి బ్యాంక్ సమర్పించిన జవాబు, మౌఖిక నివేదనలు, అదనపు సమాచారం, పత్రాలు పరిశీలించిన తరువాత, ఇండస్ఇండ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలను /మార్గదర్శకాలను అతిక్రమించినదని నిరూపించబడినట్లు, అవి నగదు జరిమానా విధించదగినవేనని, రిజర్వ్ బ్యాంక్ నిర్ణయానికి వచ్చినది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2017-2018/1617 |