జనతా సహకారి బ్యాంకు లిమిటెడ్, పూణే ఫై భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా జరిమానా విధింపు
తేదీ: 29/10/2019 జనతా సహకారి బ్యాంకు లిమిటెడ్, పూణే ఫై భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా జరిమానా భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) ద్వారా ‘ఆదాయం గుర్తింపు మరియు ఆస్తి వర్గీకరణ’ (IRAC), యాజమాన్య అడ్వాన్సులు మరియు ఎక్స్పోజర్ నిబంధనలు మరియు చట్టబద్ధమైన/ఇతర పరిమితులు కోసం జారీ చేసిన ఆదేశాలు/మార్గదర్శకాల అనుపాలనలో విఫలమైనదన్న కారణంగా, జనతా సహకారి బ్యాంకు లిమిటెడ్, పూణే ఫై అక్టోబర్ 16, 2019 నాటి ఆదేశం ద్వారా భారతీయ రిజర్వు బ్యాంకు, కోటి రూపాయల జరిమానా విధించింది. ఈ జరిమానా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4)(i), సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A(1)(c) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకొని, ఆర్బీఐ జారీచేసిన ఫై మార్గదర్శకాల ఉల్లంఘనల కొరకు విధించడం జరిగింది. ఈ చర్య, నియంత్రణ అనుపాలన లోపాల పై చేపట్టిన చర్య మాత్రమే తప్ప, వినియోగదారుల ఏ లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటు మీద ప్రభావం కలిగి ఉంటుందని ఉద్దేశించినది కాదు. నేపథ్యం మార్చ్ 31, 2018, ఆర్ధిక సంవత్సరానికి జరిగిన బ్యాంకు యొక్క చట్టబద్ధమైన తనిఖీలో మిగతా వాటితో కలిపి, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) ద్వారా ‘ఆదాయం గుర్తింపు మరియు ఆస్తి వర్గీకరణ’ (IRAC), యాజమాన్య అడ్వాన్సులు, ఎక్స్పోజర్ నిబంధనలు మరియు చట్టబద్ధమైన/ఇతర పరిమితులు మరియు ఎటిఎం-కమ్ డెబిట్ కార్డుల జారీ కొరకు ఆర్.బి.ఐ జారీచేసిన ఆదేశాలు/మార్గదర్శకాల అనుపాలనలో ఉల్లంఘన జరిగినట్లు వెల్లడైంది. తనిఖీ నివేదిక/దస్తావేజుల ఆధారంగా, జారీచేసిన ఆదేశాలు/మార్గదర్శకాల అనుపాలనలో విఫలమైనదన్న ఆరోపణల ఫై, జరిమానా ఎందుకు విధించకూడదు అని బ్యాంకుకు నోటీసు జారీ చేయబడింది. బ్యాంకు ఇచ్చిన మౌఖిక నివేదనలను పరిగణించిన అనంతరం, ‘ఆదాయం గుర్తింపు మరియు ఆస్తి వర్గీకరణ’ (IRAC), యాజమాన్య అడ్వాన్సులు, ఎక్స్పోజర్ నిబంధనలు మరియు చట్టబద్ధమైన/ఇతర పరిమితులు పై జారీచేసిన ఆదేశాలు/మార్గదర్శకాల అనుపాలనలో ఉల్లంఘన వాస్తవమని నమ్ముతూ, జరిమానా విధించాలని ఆర్.బి.ఐ నిర్ధారణకు రావడం జరిగింది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2019-2020/1049 |