<font face="mangal" size="3">కోటక్ మహీంద్రా బ్యాంక్ లి. పై, రిజర్వ్ బ్యాంక - ఆర్బిఐ - Reserve Bank of India
కోటక్ మహీంద్రా బ్యాంక్ లి. పై, రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధించినది
తేదీ: 07/06/2019 కోటక్ మహీంద్రా బ్యాంక్ లి. పై, రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధించినది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వారి ఆదేశం తేదీ జూన్ 06, 2019 ద్వారా, కోటక్ మహీంద్రా బ్యాంక్ లి. (బ్యాంక్) పై 20 మిలియన్ రూపాయిల నగదు జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్లు 27(2), 35A లో పేర్కొన్న సమాచారం సమర్పించవలెనని జారీచేసిన ఆదేశాలు పాటించని కారణంగా ఈ జరిమానా విధించబడింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 47A(1)(c) [సెక్షన్ 46 (4)(i) తో కలిపి], తమకు దఖలు పరచిన అధికారాలతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈజరిమానా విధించినది. నియంత్రణా మార్గదర్శకాలు పాటించుటలో లోపాలు జరిగిన కారణంగా ఈ చర్య తీసుకోబడిందేతప్ప. బ్యాంకు, ఖాతాదారులతో జరిపిన లావాదేవీలు/చేసుకున్న ఒప్పందాల చెల్లుబడిమీద, ఇది తీర్మానము కాదు. నేపథ్యం: ప్రమోటర్లయొక్క షేర్ల వివరాలు మరియు వారి షేర్ల మొత్తం (షేర్‌హోల్డింగ్) మరియు నియమిత కాలపరిమితిలో తగ్గించడానికి బ్యాంకు తీసుకోదలచిన చర్యలు/ప్రణాళిక/పథకాలకు సంబంధించిన సమాచారం సమర్పించవలెనని రిజర్వ్ బ్యాంక్, బ్యాంకును ఆదేశించింది. ఆతరువాత, నిర్దేశించిన కాలపరిమితిలోగా ప్రమోటర్ల షేర్‌హోల్డింగ్ తగ్గిస్తామని, హామీ సమర్పించవలసినదిగా బ్యాంక్ ఆదేశించబడింది. అయితే, బ్యాంక్ ఈ ఆదేశాలు పాటించుటలో విఫలమయింది. వారి వైఫల్యానికి జరిమానా ఎందుకు విధించరాదో తెలపమని బ్యాంకుకు షోకాజ్ నోటీస్ (ఎస్ సి ఎన్) జారీచేయబడింది. వారు ఇచ్చిన జవాబు, ప్రత్యక్షంగా చేసిన అభ్యర్థనలు, సమర్పించిన పత్రాలు పరిశీలించి, బ్యాంకు, మార్గదర్శకాలు పాటించలేదని, అందుకు వారిపై జరిమానా విధించవలెనని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయానికి వచ్చింది. యోగేశ్ దయాల్ పత్రికా ప్రకటన: 2018-2019/2896 |