<font face="mangal" size="3">పంజాబ్ నేషనల్ బ్యాంక్ పై భారతీయ రిజర్వు బ్యĹ - ఆర్బిఐ - Reserve Bank of India
పంజాబ్ నేషనల్ బ్యాంక్ పై భారతీయ రిజర్వు బ్యాంక్ నగదు జరిమానా విధింపు
మార్చి 27, 2019 పంజాబ్ నేషనల్ బ్యాంక్ పై భారతీయ రిజర్వు బ్యాంక్ నగదు జరిమానా విధింపు. ఆదాయo గుర్తింపు మరియు ఆస్తుల వర్గీకరణ (ఇన్కమ్ రికగ్నిషన్ అండ్ అసెట్ క్లాసిఫికేషణ్ - ఐరాక్) నిబంధనలు, మోసాలకు సంబంధించి నివేదించడం మరియు కరెంట్ (current) ఖాతాలు తీరిచే సమయంలో తగిన క్రమశిక్షణను పాటించడం, వీటికి సంబంధించి తమ ఆదేశాలను అమలుపరచ నందులకు భారతీయ రిజర్వు బ్యాంకు సెప్టెంబర్ 25, 2018 నాటి ఆర్డర్ ద్వారా కరూర్ వైశ్యా బ్యాంక్ లిమిటెడ్ (ఆ బ్యాంక్) పై, ₹ 20 మిలియన్ల నగదు జరిమానా విధించింది. ముందు చెప్పఁబడిన నిబంధనలకు సంబంధించి తమ ఆదేశాలను అమలుపరచడంలో వైఫల్యంచెందినందులకు గాను బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 47A (1)(c) మరియు సెక్షన్ 46 (4)(i) నిబంధనల క్రింద రిజర్వు బ్యాంకుకు దఖలుపరచబడిన అధికారాలతో, ఈ జరిమానా విధించడం జరిగింది. ఈ చర్యను, నియంత్రణలు పాటించడంలో లోపాల మూలంగా మాత్రమే తీసుకోబడిoదితప్ప, వారి ఖాతాదార్లతో జరిపిన ఏ లావాదేవీ లేదా ఒప్పందాల చెల్లుబడి మీద తీర్మానం చెప్పినట్లుగా భావింపరాదు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన : 2018-2019/2300 |