మహారాష్ట్ర లోని సోలాపుర్ నగరానికి చెందిన "సమర్థ్ సహకారి బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్. - ఆర్బిఐ - Reserve Bank of India
"పట్టణ సహకార బ్యాంకుల నియమ నిభంధనలను బహిరంగ పరచుట" కు సంబధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల మహారాష్ట్ర లోని సోలాపుర్ నగరానికి చెందిన "సమర్థ్ సహకారి బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంకు 12-04-2024 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 50,000 (యాభై వేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 లోని 47A (i)(C), 46(4)(i) మరియు 56 విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొంటూ ఈ అపరాధ రుసుమును విధించింది. ఈ బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిగతులపై 31-03-2023 తేదీన భారతీయ రిజర్వ్ బ్యాంకు చట్టబద్ధమైన విచారణ జరిపింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన మార్గ నిర్దేశకాలను సదరు బ్యాంక్ పరిమితికి మించి భద్రత లేని బయనాలను మంజూరు చేసినట్లు గుర్తించి సదరు బ్యాంక్ మీద ఎందుకు చర్య తీసుకొనకూడదో వివరించాలంటూ ఒక నోటిసు ను జారీ చేసింది. ఈ నోటీసుకు బ్యాంకు వారు పంపిన ప్రత్యుత్తరము, దాఖలు పరచిన అదనపు సమాచారము మరియు మౌఖిక సమర్పణల ఆధారంగా సదరు బ్యాంక్ పై అపరాధ రుసుమును విధించింది. నియమ నిబంధనలను సరిగా పాటించని కారణంగా ఈ చర్య తీసుకోబడింది. అంతే కానీ బ్యాంకు యొక్క ఖాతాదారులు జరుపుతున్న లావాదేవీలు, ఒప్పందాలపై ఈ చర్య ఎటువంటి ప్రభావము చూపదు. అపరాధ రుసుము విధించినప్పటికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ సదరు బ్యాంక్ పైన మరేదైనా చర్య తీసుకొనే అధికారం కలిగి వుంటుంది.
(యోగీష్ దయాళ్) ముఖ్య నిర్వహణ అధికారి పత్రికా విడుదల: 2024-2025/209 |