<font face="mangal" size="3">భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా ఏడు బ్యాంకుల  - ఆర్బిఐ - Reserve Bank of India
భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా ఏడు బ్యాంకుల ఫై జరిమానా విధింపు
తేది: 02/08/2019 భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా ఏడు బ్యాంకుల ఫై జరిమానా విధింపు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) జులై 31, 2019 నాటి ఆదేశం ప్రకారం, క్రింద సూచించిన ఏడు బ్యాంకులపై ఆర్ధిక జరిమానా విధించింది. ఈ జరిమానాలు భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా, “వాడుక ఖాతా (కరెంట్ అకౌంట్స్) తెరవడానికి మరియు నిర్వహించడానికి ప్రవర్తనా నియమావళి”, “బ్యాంకుల ద్వారా వాడుక ఖాతా తెరవడం - క్రమశిక్షణ అవశ్యకత”, “బ్యాంకుల ద్వారా బిల్లుల డిస్కౌంట్/రీడిస్కౌంట్”, “రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (వాణిజ్య బ్యాంకుల మరియు ఎంచిన ఆర్ధిక సంస్థల ద్వారా మోసపూరిత కార్యకలాపాల వర్గీకరణ మరియు రిపోర్టింగ్) ఆదేశాలు 2016”, “నిధుల చివరి వినియోగం - పర్యవేక్షణ” మరియు “బ్యాలెన్స్ షీట్ తేదీన డిపాజిట్లు” వంటి జారీ చేసిన కొన్ని నిబంధనల అనుపాలనా లోపం కొరకు విధించడం జరిగింది
ఈ జరిమానాలు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 46(4)(i) మరియు 51(1) తో కలిపి సెక్షన్ 47A(1)(c) క్రింద ప్రదానం చేసిన అధికారాలను వినియోగించుకొని పైన ఉదహరించిన భారతీయ రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలను/ఆదేశాలను పాటించడంలో వైఫల్యానికి విధించడం జరిగింది. ఈ చర్య ఆదేశాల అనుపాలనా లోపం కొరకు మాత్రమే తప్ప, వినియోగదారుల ఏ లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటు మీద అభిప్రాయ వ్యక్తీకరణ కాదు. నేపథ్యం ఒక గ్రూప్ యొక్క కంపెనీల ఖాతాల ఫై ఆర్బిఐ నిర్వహించిన తనిఖీ లో, పైన పేర్కొన్న విధంగా ఆర్.బి.ఐ జారీ చేసిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆదేశాల నిబంధనలను పాటించడంలో బ్యాంకులు విఫలమయ్యాయని గమనించబడింది. పరిశీలన ద్వారా ప్రాప్తించిన సమాచారం ఆధారంగా, విధించిన షరతులను పాటించడంలో విఫలమైనదన్న ఆరోపణల ఫై, జరిమానాఎందుకు విధించకూడదు అని బ్యాంకులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. బ్యాంకులు ఇచ్చిన లిఖిత సమాధానం, కోరిన బ్యాంకుల కొరకు జరిపిన వ్యక్తిగత విచారణలోని మౌఖిక నివేదనలు మరియు అదనపు నివేదనలను (వున్న చోట) పరిగణించిన అనంతరం, ఆర్.బి.ఐ ఆదేశాలు పాటించడంలో బ్యాంకులు విఫలమయ్యాయన్న ఆరోపణలు వాస్తవమని నమ్ముతూ, ప్రతి బ్యాంకులో పాటించని ఆదేశాల పరిధి ఆధారంగా, పైన ఉదహరించిన ఏడు బ్యాంకులపై ఆర్ధిక జరిమానాలు విధించాలని ఆర్.బి.ఐ నిర్ధారణకు వచ్చింది. యోగేష్ దయాళ్ పత్రికా ప్రకటన: 2019-2020/321 |