RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78529317

శ్రీ మహాయోగి లక్ష్మమ్మ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా ద్రవ్య జరిమానా విధింపు

09 జనవరి 2023

శ్రీ మహాయోగి లక్ష్మమ్మ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా ద్రవ్య జరిమానా విధింపు

శ్రీ మహాయోగి లక్ష్మమ్మ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్ (బ్యాంకు)పై, UCBలకు వర్తించే ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ, ప్రొవిజనింగ్ మరియు ఇతర సంబంధిత విషయాలపై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) జారీ చేసిన ఆదేశాలను పాటించనందుకు, RBI జనవరి 02, 2023 నాటి ఉత్తర్వు ద్వారా, రూ.1.00 లక్ష (రూ. ఒక లక్ష మాత్రమే) ద్రవ్య జరిమానా విధించింది. RBI జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే విధంగా) లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని ఈ జరిమానా విధించబడింది.

ఈ చర్య నియంత్రణ అనుపాలనల లోపాలపై ఆధారపడి తీసుకున్నదే తప్ప, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా అన్వయించుకోరాదు.

నేపధ్యము

బ్యాంక్ యొక్క మార్చి 31, 2021 నాటి ఆర్థిక స్థితి ఆధారంగా చేపట్టిన తనిఖీ నివేదిక, మిగతావాటితో కలిపి, IRAC నిబంధనలకు అనుగుణంగా నిర్దిష్ట రుణ ఖాతాలను నిరర్థక ఆస్తులుగా బ్యాంక్ వర్గీకరించలేదని వెల్లడించింది. దీని ఆధారంగా, ఆదేశాలను పాటించనందుకు అపరాధ రుసుము ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంకుకు నోటీసు జారీ చేయబడింది.

బ్యాంక్ యొక్క ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత, ఈ విషయంలో బ్యాంకు ద్వారా RBI ఆదేశాల ఉల్లంఘన వాస్తవమని మరియు అపరాధ రుసుము విధించదగినదిగా, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.

(యోగేష్ దయాల్)
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2022-2023/1521

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?