<font face="mangal" size="3">సౌత్ ఇండియన్‌ బ్యాంక్ లి., పై, రిజర్వ్ బ్యాంక్&z - ఆర్బిఐ - Reserve Bank of India
సౌత్ ఇండియన్ బ్యాంక్ లి., పై, రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధించినది
తేదీ: 19/06/2019 సౌత్ ఇండియన్ బ్యాంక్ లి., పై, రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధించినది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వారి ఆదేశం తేదీ జూన్ 13, 2019 ద్వారా, సౌత్ ఇండియన్ బ్యాంక్ లి., (బ్యాంక్) పై రూపాయిలు 1 మిలియన్, నగదు జరిమానా విధించింది. 'గ్యారంటీలు మరియు కో-ఏక్సెప్టెన్సులకు' సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన మార్గదర్శకాలు పాటించని కారణంగా, ఈ జరిమానా విధించబడింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 47A(1)(c) [సెక్షన్ 46 (4)(i) తో కలిపి], తమకు దఖలు పరచిన అధికారాలతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈజరిమానా విధించినది. నియంత్రణా మార్గదర్శకాలు పాటించుటలో లోపాలు జరిగిన కారణంగా ఈ చర్య తీసుకోబడిందేతప్ప. బ్యాంకు, ఖాతాదారులతో జరిపిన లావాదేవీలు / చేసుకున్న ఒప్పందాల చెల్లుబడిమీద, ఇది తీర్మానము కాదు. నేపథ్యం: సౌత్ ఇండియన్ బ్యాంక్ లి., తాము జారీచేసిన 'బ్యాంక్ గ్యారంటీ' సొమ్ము చెల్లించుటలేదని, ఒక ప్రభుత్వ శాఖనుండి మరియు ఒక ప్రైవేట్ పార్టీనుండి, రిజర్వ్ బ్యాంకుకు ఫిర్యాదులు అందినవి. ఈ విషయమై జరిపిన పరిశోధనలో, 'గ్యారంటీలు మరియు కో-ఏక్సెప్టెన్సెస్' విషయమై రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన మార్గదర్శకాలు, బ్యాంక్ ఉల్లంఘించినట్లు వెల్లడయింది. పై మార్గదర్శకాలు పాటించనందుకు, నగదు జరిమానా ఎందుకు విధించరాదో తెలపమని బ్యాంకుకు నోటీస్ జారీచేయబడింది. బ్యాంక్ సమర్పించిన జవాబు, ప్రత్యక్ష సమావేశంలో చేసిన విజ్ఞాపనలు, సమావేశం తరువాత చేసిన అదనపు విన్నపాలు పరిశీలించిన తరువాత, రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు పాటించలేదన్న ఆరోపణలు నిరూపించబడ్డవని, అవి జరిమానా విధింపతగినవేనని, రిజర్వ్ బ్యాంక్ నిశ్చయించింది. యోగేశ్ దయాల్ పత్రికా ప్రకటన: 2018-2019/2990 |