<font face="mangal" size="3">భారతీయ స్టేట్ బ్యాంకు ఫై భారతీయ రిజర్వు బ్య - ఆర్బిఐ - Reserve Bank of India
భారతీయ స్టేట్ బ్యాంకు ఫై భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధింపు
మార్చ్ 07, 2018 భారతీయ స్టేట్ బ్యాంకు ఫై భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధింపు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) ద్వారా జారీచేయబడిన ‘నకిలీ నోట్ల గుర్తింపు మరియు స్వాధీనత’ నిబంధనల మార్గదర్శకాలను/ఆదేశాలను ఉల్లంఘించినందుకు, భారతీయ రిజర్వు బ్యాంకు, భారతీయ స్టేట్ బ్యాంకు ఫై మార్చ్ 01, 2018 న 4 మిలియన్ జరిమానా విధించింది. ఈ జరీమానా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 47A(1)(c) తో కలిపి, సెక్షన్ 46(4)(1) లోని అధికారాలను వినియోగించుకొని, పైన ఉదహరించిన మార్గదర్శకాలను/ఆదేశాలను ఉల్లంఘించినందుకు, విధించడం జరిగింది. ఈ చర్య, మార్గదర్శకాలను/ఆదేశాలను బ్యాంకు పాటించనందుకు మాత్రమే తప్ప, వినియోగదారుల ఏ లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటు మీద ప్రభావం కలిగి ఉండదు. నేపథ్యం బ్యాంకు యొక్క కరెన్సీ చెస్ట్ తనిఖీలో, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) ద్వారా జారీచేయబడిన ‘నకిలీ నోట్ల గుర్తింపు మరియు స్వాధీనత’ నిబంధనల మార్గదర్శకాలను/ఆదేశాలను పాటించడంలో ఉల్లంఘన జరిగినట్లు వెల్లడైంది. తనిఖీ నివేదిక/దస్తావేజుల ఆధారంగా, ఆర్.బి.ఐ ఆదేశాలు/మార్గదర్శకాలు పాటించడంలో విఫలమైనదన్న ఆరోపణల ఫై, జరీమానా ఎందుకు విధించకూడదు అని బ్యాంకుకు నోటీసు జారీ చేయడం జరిగింది. బ్యాంకు ఇచ్చిన లిఖిత సమాధానం, వ్యక్తిగత విచారణలో మౌఖిక నివేదనలను పరిగణించిన అనంతరం, ఆర్.బి.ఐ ఆదేశాలు/మార్గదర్శకాలు పాటించడంలో బ్యాంకు విఫలమైనదన్న ఆరోపణలు వాస్తవమని నమ్ముతూ, జరీమానా విధించాలని నిర్ధారణకు రావడం జరిగింది. జోస్ జె. కట్టూర్ పత్రికా ప్రకటన: 2017-2018/2385 |