<font face="mangal" size="3">సుధా కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, రి - ఆర్బిఐ - Reserve Bank of India
సుధా కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, రిజిస్టర్డ్ నెం.599/TH,
సూర్యాపేట, తెలంగాణ పై భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా ద్రవ్య
జరిమానా విధింపు
20 ఫిబ్రవరి 2023 సుధా కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, రిజిస్టర్డ్ నెం.599/TH, సుధా కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, రిజిస్టర్డ్ నెం.599/TH, సూర్యాపేట, తెలంగాణ (ది బ్యాంక్) పై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) తన ఫిబ్రవరి 15, 2023 నాటి ఆదేశం ద్వారా, UCBలకు వర్తించే ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ, ప్రొవిజనింగ్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఎక్స్‌పోజర్ నిబంధనలపై మరియు చట్టబద్ధమైన / ఇతర పరిమితులు విషయాలపై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) జారీ చేసిన ఆదేశాలను పాటించనందుకు, రూ.2.00 లక్షలు (రూ. రెండు లక్షలు మాత్రమే) జరిమానా విధించింది. RBI జారీ చేసిన ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంస్థలకు వర్తించే విధంగా-AACS) లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని RBI ద్వారా ఈ జరిమానా విధింపబడింది. ఈ చర్య నియంత్రణ అనుపాలనల లోపాలపై ఆధారపడి తీసుకున్నదే తప్ప, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా భావించరాదు. నేపధ్యము బ్యాంకు యొక్క మార్చి 31, 2019 మరియు మార్చి 31, 2020 నాటి ఆర్థిక స్థితి ఆధారంగా చేపట్టిన తనిఖీ నివేదికలు మిగతావాటితో కలిపి, డైరెక్టర్లకు బ్యాంకు రుణాలు మంజూరు చేసినట్లు, డైరెక్టర్ సంబంధిత రుణాలకు ఎవర్ గ్రీన్ పద్దతిని ఆశ్రయించినట్లు మరియు ఏక రుణ గ్రహీత ఎక్స్‌పోజర్ పరిమితులను ఉల్లంఘించినట్లు వెల్లడి చేశాయి. దీని ఆధారంగా, పైన ఉటంకించిన ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంకుకు నోటీసు జారీ చేయబడింది. బ్యాంక్ యొక్క ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత, ఈ విషయంలో బ్యాంకు ద్వారా RBI ఆదేశాల ఉల్లంఘన వాస్తవమని మరియు జరిమానా విధించదగినదిగా, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాల్) పత్రికా ప్రకటన: 2022-2023/1760 |