<font face="mangal" size="3px">భారతీయ రిజర్వు బ్యాంకు, సిండికేట్ బ్యాంకు ప - ఆర్బిఐ - Reserve Bank of India
భారతీయ రిజర్వు బ్యాంకు, సిండికేట్ బ్యాంకు పై నగదు జరిమానా విధించింది
తేదీ: 15/12/2017 భారతీయ రిజర్వు బ్యాంకు, సిండికేట్ బ్యాంకు పై నగదు జరిమానా విధించింది చెక్ పర్చేజ్/డిస్కౌంట్, బిల్ డిస్కౌంటింగ్ మరియు మీ కస్టమర్ ను తెలుసుకోండి (KYC)/ యాంటీ-మనీ లాండరింగ్ (AML) నిబంధనల ఫై, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) ఇచ్చిన ఆదేశాలు /మార్గదర్శకాలను పాటించనందుకు, ఆర్.బి.ఐ, డిసెంబరు 12, 2017 న, సిండికేట్ బ్యాంక్ ఫై ₹ 50 మిలియన్ నగదు జరిమానా విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 లోని సెక్షన్ 46 (4) (i) తో సెక్షన్ 47A (1) (సి) లోని నిబంధనల క్రింద భారతీయ రిజర్వు బ్యాంకు కు ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకుంటూ, అట్టి ఆదేశాలు/మార్గదర్శకాలు పాటించడములో బ్యాంకు విఫలమైనందున, ఈ జరిమానా విధించబడింది. ఈ చర్య నియంత్రణ సమ్మతి లో లోపాల ఆధారంగా తీసుకోవడం జరిగిందేకాని, బ్యాంకు మరియు వినియోగదారుల యొక్క ఏదేని లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటు ఫై ప్రభావం చూపడానికి కాదు. నేపధ్యం నివేదించిన మోసానికి సంబంధించి బ్యాంకు యొక్క కొన్ని శాఖలలో ఆర్.బి.ఐ, అట్టి శాఖల దస్తావేజులను పరిశీలించింది. అట్టి దస్తావేజుల పరిశీలన/పరీక్ష తరువాత, ఆర్.బి.ఐ జారీ చేసిన ఆదేశాలు/మార్గదర్శకాలు పాటించడంలో బ్యాంకు విఫలమైనందున, జరీమానా ఎందుకు విధించకూడదు అని బ్యాంకుకు నోటీసు జారీ చేయడం జరిగింది. బ్యాంకు ఇచ్చిన లిఖిత సమాధానం, వ్యక్తిగత విచారణలో మౌఖిక నివేదనలను పరిగణించిన అనంతరం, ఆర్.బి.ఐ ఆదేశాలు/మార్గదర్శకాలు పాటించడంలో బ్యాంకు విఫలమైనదన్న ఆరోపణలు వాస్తవమని నమ్ముతూ, జరీమానా విధించాలని నిర్ధారణకు రావడం జరిగింది. అనిరుద్ధ డి. జాధవ్ పత్రికా ప్రకటన: 2017-2018/1650 |