<font face="mangal" size="3">సిండికేట్ బ్యాంకు ఫై భారతీయ రిజర్వు బ్యాంకĹ - ఆర్బిఐ - Reserve Bank of India
సిండికేట్ బ్యాంకు ఫై భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా జరిమానా విధింపు
తేదీ: 14/10/2019 సిండికేట్ బ్యాంకు ఫై భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా జరిమానా విధింపు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) ద్వారా జారీ చేసిన (i) మోసాల వర్గీకరణ మరియు నివేదన మరియు (ii) గృహ నిర్మాణ రంగం: వినూత్న గృహ రుణ ఉత్పత్తులు - గృహ రుణాల ముందస్తు పంపిణీపై జారీచేసిన ఆదేశాలు/మార్గదర్శకాల అనుపాలనలో విఫలమైనదన్న కారణంగా, సిండికేట్ బ్యాంకు ఫై అక్టోబర్ 14, 2019 నాటి ఆదేశం ద్వారా భారతీయ రిజర్వు బ్యాంకు, ₹ 75 లక్షల జరిమానా విధించింది. ఈ జరిమానా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4)(i), సెక్షన్ 51(1)తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లో ఆర్.బి.ఐ కి సంక్రమించిన అధికారాలను వినియోగించుకొని, అనుపాలన ఉల్లంఘన కొరకు విధించడం జరిగింది. ఈ చర్య, నియంత్రణ అనుపాలన లోపాల పై చేపట్టిన చర్య మాత్రమే తప్ప, వినియోగదారుల ఏ లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటు మీద ప్రభావం కలిగి ఉంటుందని ఉద్దేశించినది కాదు. నేపథ్యం బ్యాంకు సమర్పించిన రిటర్న్ లో భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) ద్వారా జారీ చేసిన మోసాల వర్గీకరణ మరియు నివేదన మరియు గృహ రుణాల పంపిణీపై జారీచేసిన ఆదేశాలు/మార్గదర్శకాల అనుపాలనలో బ్యాంకు విఫలమైనట్లుగా వెల్లడైంది. కనుగొన్న సమచారం ఆధారంగా, ఆర్.బి.ఐ జారీచేసిన ఆదేశాలు/మార్గదర్శకాల అనుపాలనలో విఫలమైనదన్న ఆరోపణల ఫై, జరిమానా ఎందుకు విధించకూడదు అని బ్యాంకుకు నోటీసు జారీ చేయబడింది. బ్యాంకు ఇచ్చిన లిఖిత సమాధానం మరియు వ్యక్తిగత విచారణ లో బ్యాంకు ఇచ్చిన నివేదనలను పరిశీలించిన తరువాత, ఈ విషయంలో బ్యాంకు యొక్క ఉల్లంఘన వాస్తవమని మరియు జరిమానా విధించదగినదిగా భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2019-2020/941 |