RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

128884779

అంజనగవ్ సుర్జీ నగరి సహకార బ్యాంక్ లిమిటెడ్, అంజనగవ్ సుర్జీ, మహారాష్ట్ర వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (BR చట్టం) నందలి సెక్షన్ 56తో కలిపి సెక్షన్లు 35(A)(1) మరియు 36(1) ప్రకారం నిర్దిష్ట నియమాలు, విదివిధానాలాను ఉలంఘించినందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా ఫిబ్రవరి 08, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా అంజనగవ్ సుర్జీ నగరి సహకార బ్యాంక్ లిమిటెడ్, అంజనగవ్ సుర్జీ, మహారాష్ట్ర (బ్యాంక్) వారి పై ₹50,000/-(యాభై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి లావాదేవిలతో గానీ, ఒప్పందాల చెల్లుబాటు విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు.

నేపథ్యం:

మార్చి 31, 2022 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి ఆర్బిఐ చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది.  ఈ చర్యలో భాగంగా తనిఖీ నివేదిక, రిస్క్ అంచనా నివేదిక మరియు దానికి సంబంధించిన అన్ని ప్రత్యుత్తరాల సమగ్ర పరిశీలన ద్వారా వెల్లడైన అంశాలు (i) RBI చట్టం నందలి సెక్షన్ 56తో కలిపి సెక్షన్లు 35(A)(1) యందు పేర్కొన్న పరిమితికి మించి డిపాజిట్ దారులకు నగదు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. (ii) సూపర్‌వైజరీ యాక్షన్ ఫ్రేమ్‌వర్క్ (SAF) కింద జారీ చేయబడిన నిర్దిష్ట ఆదేశాలను ఉల్లంఘిస్తూ తాజా రుణాలను పంపిణీ చేసిందికావున పొందుపరిచిన మార్గదర్శకాలను అనుసరించుటలో వైఫల్యం కారణంగా బ్యాంకు పై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది.

భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటీసుకు బ్యాంకు వారి వివరణ పరిశీలించిన తరువాత, మరియు బ్యాంకుతో సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ పరిగణించిన పిమ్మట, పైన పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలను అనుసరించుటలో లోపాలకు గాను ఆర్బిఐ విధించిన నగదు జరిమానా సరియైనది, సహేతుకమైనదిగా నిర్ధారించడమైనది.

 యోగేష్ దయాల్

చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా  ప్రకటన2023-2024/1867

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?