<font face="mangal" size="3">ది అత్తూర్ టౌన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడĺ - ఆర్బిఐ - Reserve Bank of India
ది అత్తూర్ టౌన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అత్తూరు, సేలం జిల్లా, తమిళనాడుపై భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య జరిమానా విధింపు
జనవరి 09, 2023 ది అత్తూర్ టౌన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అత్తూరు, సేలం జిల్లా, భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) జనవరి 02, 2023 నాటి తమ ఉత్తర్వు ద్వారా, “బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ – UCBలు” అనే విషయాలపై RBI జారీ చేసిన ఆదేశాలను అమలుచేయనందులకు/ ఉల్లంఘించినందులకు, ది అత్తూర్ టౌన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అత్తూరు, సేలం జిల్లా, తమిళనాడు (‘బ్యాంక్’) పై ₹1.00 లక్ష (ఒక లక్ష రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. RBI జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే విధంగా) లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1) (c) లోని అధికారాలను వినియోగించుకొని ఈ జరిమానా విధించబడింది. ఈ చర్య నియంత్రణ అనుపాలన లోని లోపాలపై ఆధారపడి తీసుకున్నదే గాని, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే వొక అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు. నేపథ్యo మార్చి 31, 2021 తేదీనాటి బ్యాంక్ ఆర్థిక స్థితికి సంబంధించి RBI నిర్వహించిన చట్టబద్ధమైన తనిఖీ నివేదిక, మిగతావాటితోపాటు, ప్రస్తుతo అమలులోయున్న సూచనలను ఉల్లంఘిస్తూ 2018 సంవత్సరం నుండి 2020 సంవత్సరం వరకు మధ్యకాలంలో డైరెక్టర్‌లకు ఆభరణాల రుణాలను మంజూరు చేసిందని వెల్లడించింది. దీని ఆధారంగా, RBI జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను ఉల్లంఘించినందులకు, జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంక్ కు వొక నోటీసు జారీ చేయబడింది. బ్యాంక్ యొక్క ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని మౌఖికఅంశాలను పరిగణనలోకి తీసుకున్న తదుపరి, ఈ విషయంలో బ్యాంక్ ద్వారా RBI ఆదేశాల ఉల్లంఘన వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2022-2023/1520 |