<font face="mangal" size="3px">ది గోవా అర్బన్‌ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., పానాజ - ఆర్బిఐ - Reserve Bank of India
ది గోవా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., పానాజి, గోవాపై,రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధించినది
తేదీ: 13/09/2019 ది గోవా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., పానాజి, గోవాపై,రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధించినది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వారి ఆదేశం తేదీ సెప్టెంబర్ 11, 2019 ద్వారా, ది గోవా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., పానాజి (బ్యాంక్) పై 5 లక్షల రూపాయిల, నగదు జరిమానా విధించింది. 'సూపర్వైజరీ ఏక్షన్ ఫ్రేమ్వర్క్, (స్ ఏ ఎఫ్, SAF)' కు సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన మార్గదర్శకాలు పాటించని కారణంగా, ఈ జరిమానా విధించబడింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 47A(1)(c) [సెక్షన్ 46 (4)(i) మరియు సెక్షన్ 56 తో కలిపి], తమకు దఖలు పరచిన అధికారాలతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈజరిమానా విధించినది. నియంత్రణా మార్గదర్శకాలు పాటించుటలో లోపాలు జరిగిన కారణంగా ఈ చర్య తీసుకోబడిందేతప్ప. బ్యాంకు, ఖాతాదారులతో జరిపిన లావాదేవీలు / చేసుకున్న ఒప్పందాల చెల్లుబడిమీద, ఇది తీర్మానము కాదు. నేపథ్యం: బ్యాంకుయొక్క, మార్చ్ 31, 2018 నాటి ఆర్థిక పరిస్థితిపై, రిజర్వ్ బ్యాంక్ చట్టరీత్యా జరిపిన తనిఖీలో మిగిలిన అంశాలతోబాటు, బ్యాంక్ ఎస్ ఏ ఎఫ్ మరియు డిపాజిట్ ఖాతాల నిర్వహణకు సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలను పాటించుటలేదని వెల్లడయింది. పై మార్గదర్శకాలు పాటించనందుకు, నగదు జరిమానా ఎందుకు విధించరాదో తెలపమని బ్యాంకుకు నోటీస్ జారీచేయబడింది. బ్యాంక్ సమర్పించిన జవాబు, ప్రత్యక్ష సమావేశంలో చేసిన విజ్ఞాపనలు, సమావేశం తరువాత చేసిన అదనపు విన్నపాలు పరిశీలించిన తరువాత, ఎస్ ఏ ఎఫ్కు సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు పాటించలేదన్న ఆరోపణ, అవి జరిమానా విధింపతగినదేనని, రిజర్వ్ బ్యాంక్ నిశ్చయించింది. యోగేశ్ దయాల్ పత్రికా ప్రకటన: 2019-2020/698 |