RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78514682

లక్ష్మీ విలాస్ బ్యాంకు లిమిటెడ్ ఫై భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా జరిమానా విధింపు

తేదీ: 14/10/2019

లక్ష్మీ విలాస్ బ్యాంకు లిమిటెడ్ ఫై భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా జరిమానా విధింపు

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్.బి.ఐ) ద్వారా ‘ఆదాయం గుర్తింపు మరియు ఆస్తి వర్గీకరణ’ (IRAC) కోసం జారీ చేసిన ఆదేశాలు/మార్గదర్శకాల అనుపాలనలో విఫలమైనదన్న కారణంగా, లక్ష్మీ విలాస్ బ్యాంకు లిమిటెడ్ ఫై అక్టోబర్ 14, 2019 నాటి ఆదేశం ప్రకారం భారతీయ రిజర్వు బ్యాంకు, కోటి రూపాయల జరిమానా విధించింది. ఈ జరిమానా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4)(i) తో కలిపి, సెక్షన్ 47A(1)(c) లో ఆర్.బి.ఐ కి సంక్రమించిన అధికారాలను వినియోగించుకొని, అనుపాలన ఉల్లంఘన కొరకు విధించడం జరిగింది.

ఈ చర్య, నియంత్రణ అనుపాలన లోపాల పై చేపట్టిన చర్య మాత్రమే తప్ప, వినియోగదారుల ఏ లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటు మీద ప్రభావం కలిగి ఉంటుందని ఉద్దేశించినది కాదు.

నేపథ్యం

మార్చ్ 31, 2017, ఆర్ధిక సంవత్సరానికి జరిగిన బ్యాంకు యొక్క చట్టబద్ధమైన తనిఖీలో మిగతా వాటితో కలిపి, ‘ఆదాయం గుర్తింపు మరియు ఆస్తి వర్గీకరణ’ (IRAC) కోసం ఆర్.బి.ఐ జారీచేసిన ఆదేశాలు/మార్గదర్శకాల అనుపాలనలో ఉల్లంఘన జరిగినట్లు వెల్లడైంది. తనిఖీ నివేదిక/దస్తావేజుల ఆధారంగా, ఆర్.బి.ఐ జారీచేసిన ఆదేశాలు/మార్గదర్శకాల అనుపాలనలో విఫలమైనదన్న ఆరోపణల ఫై, జరిమానా ఎందుకు విధించకూడదు అని బ్యాంకుకు నోటీసు జారీ చేయబడింది. బ్యాంకు ఇచ్చిన లిఖిత సమాధానం మరియు అదనపు నివేదనలను పరిగణించిన అనంతరం, జారీచేసిన ఆదేశాలు/మార్గదర్శకాల అనుపాలనలో ఉల్లంఘన వాస్తవమని నమ్ముతూ, జరిమానా విధించాలని ఆర్.బి.ఐ నిర్ధారణకు రావడం జరిగింది.

(యోగేష్ దయాళ్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2019-2020/940

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?