<font face="mangal" size="3">ది మెహసానా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటĺ - ఆర్బిఐ - Reserve Bank of India
ది మెహసానా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ పై భారతీయ రిజర్వు బ్యాంకు నగదు జరిమానా విధింపు
నవంబర్ 05, 2019 ది మెహసానా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ పై ‘డైరెక్టర్ల బంధువుల మరియు సంబంధీకుల/సంస్థలలో వాటాలుగల్గిన డైరెక్టర్ల కు ఋణాలు మరియు అడ్వాన్సుల’ పై ఆర్బీఐ ద్వారా జారీ అయిన నిర్దేశాలను ఉల్లంఘించినందులకు మరియు ‘మీ వినియోగదారుని గురించి తెలుసుకోండి (కెవైసి) మీద ఉన్న మాస్టర్ డైరెక్షన్ల ను పాటించనందులకు నవంబర్ 04, 2019 తారీఖునాటి తమ ఉత్తర్వు ద్వారా ది మెహసానా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ పై (ది బ్యాంక్) భారతీయ రిజర్వు బ్యాంకు ₹ 5 కోట్ల నగదు జరిమానా విధించింది. ఈ జరిమానాను, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 47ఏ(1)(సి) క్రింద తమకు సంక్రమించిన అధికారాలతో పైన ఉటంకించిన ఆర్బీఐ ఆదేశాలను బ్యాంక్ అనుసరించకపోవడాన్ని దృష్టిలో ఉంచుకొని, ఆర్బీఐ విధించడం జరిగింది. ఈ చర్యను, నియంత్రణలు పాటించడంలో లోపాల మూలంగా మాత్రమే తీసుకోబడిoదితప్ప, వారి ఖాతాదార్లతో జరిపిన ఏ లావాదేవీ లేదా ఒప్పందాల చెల్లుబడి మీద తీర్మానం చెప్పినట్లుగా భావింపరాదు. నేపథ్యం మార్చి 31, 2018 తారీఖు నాటి బ్యాంక్ ఆర్ధిక స్థితిగతుల మీద భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా జరిపిన చట్టబద్ధమైన తనిఖీలో ‘డైరెక్టర్ల బంధువుల మరియు సంబంధీకుల/సంస్థలలో వాటాలుగల్గిన డైరెక్టర్ల కు ఋణాలు మరియు అడ్వాన్సులు’; ‘ఎక్ష్పొజరు నియమాలు మరియు చట్టబద్ధ/అన్య ఆంక్షలు – యూసిబిలు’ ; ‘డైరెక్టర్లు మొదలగువారికి ఋణాలు మరియు అడ్వాన్సులు – ష్యూరిటీ/గ్యారెంటీదారుగా డైరెక్టర్లు – స్పష్టీకరణ - యూసిబిలు’; ‘క్రెడిట్ ఎక్ష్పొజరు నియమాలు మరియు ఋణాలు & అడ్వాన్సుల పై చట్టబద్ధ/అన్య ఆంక్షలు’; ‘ సెక్షన్ 26ఏ బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 క్రింద డిపాజిటర్ల శిక్షణ మరియు అవగాహనా నిధి పధకం, 2014 - కార్యాచరణ మార్గదర్శకాలు’; ప్రాధమిక (అర్బన్) సహకార బ్యాంకుల (యూసిబిలు) చే ఇతర బ్యాంకులలో డిపాజిట్ల నిమగ్నత’ మరియు ‘మీ వినియోగదారుని గురించి తెలుసుకోండి (కెవైసి) మీద మాస్టర్ డైరెక్షన్’ ల మీద వివిధ సర్క్యులర్లలో ఉన్న ఆర్బిఐ ఆదేశాలను పాటించకపోవడం బయల్పడ్డాయి. పైన ఉటంకించినటువంటి ఆర్బీఐ ఆదేశాలను పాటించకపోవడం మీద జరిమానా ఎందుకు విధించ కూడదని బ్యాంక్ కు ఒక నోటీసు జారీ చేయడం జరిగింది. బ్యాంక్ ఇచ్చిన సమాధానo మరియు వైయక్తిక విచారణ లో సమర్పించిన మౌఖిక వినతులను పరిశీలించిన తదుపరి, ‘డైరెక్టర్ల బంధువుల మరియు సంబంధీకుల/సంస్థలలో వాటాలుగల్గిన డైరెక్టర్ల కు ఋణాలు మరియు అడ్వాన్సులు’ మరియు ‘మీ వినియోగదారుని గురించి తెలుసుకోండి (కెవైసి)’ మీద ఆర్బీఐ ఆదేశాలను పాటించకపోవడం విషయంలో బ్యాంక్ యొక్క ఉల్లంఘనలు ఆర్ధిక జరిమానా విధించదగినవేనని ఆర్బీఐ నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2019-2020/1112 |