<font face="mangal" size="3">టొయోటా ఫైనాన్షియల్ సర్విసెస్ ఇండియా లి., పై, ర&# - ఆర్బిఐ - Reserve Bank of India
టొయోటా ఫైనాన్షియల్ సర్విసెస్ ఇండియా లి., పై, రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధించినది
తేదీ: 10/10/2019 టొయోటా ఫైనాన్షియల్ సర్విసెస్ ఇండియా లి., పై, రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వారి ఆదేశం తేదీ అక్టోబర్ 09, 2019 ద్వారా, టొయోటా ఫైనాన్షియల్ సర్విసెస్ ఇండియా లి., (కంపెనీ) పై 5 లక్షల రూపాయిల, నగదు జరిమానా విధించింది. 'బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలలో మోసాలపై పర్యవేక్షణ'కు సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశాలను పాటించని కారణంగా ఈ జరిమానా విధించడమైనది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏక్ట్, 1934, క్లాజ్ (b), సబ్-సెక్షన్ (1), సెక్షన్ 58 G [క్లాజ్ (aa), సబ్-సెక్షన్ (5), సెక్షన్ 58B తో కలిపి] తమకు దఖలు పరచిన అధికారాలతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజరిమానా విధించినది. నియంత్రణా మార్గదర్శకాలు పాటించుటలో లోపాలు జరిగిన కారణంగా ఈ చర్య తీసుకోబడిందేతప్ప, కంపెనీ తమ ఖాతాదారులతో జరిపిన లావాదేవీలు / చేసుకున్న ఒప్పందాల చెల్లుబడిమీద, ఇది తీర్మానము కాదు. నేపథ్యం: జులై-ఆగస్ట్ 2018 లో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934, సెక్షన్ 45N క్రింద కంపెనీ తనిఖీచేయబడింది. ఈ తనిఖీలో కంపెనీ, ఇతర అంశాలతోబాటు, 'బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలలో మోసాలపై పర్యవేక్షణ'కు సంబంధించి, రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన నిర్దేశాలు పాటించుటలేదని గమనించడం జరిగింది. పై మార్గదర్శకాలు పాటించనందుకు, నగదు జరిమానా ఎందుకు విధించరాదో తెలపమని బ్యాంకుకు నోటీస్ జారీచేయబడింది. బ్యాంక్ సమర్పించిన జవాబు, ప్రత్యక్ష సమావేశంలో చేసిన విజ్ఞాపనలు సమగ్రంగా పరిశీలించిన తరువాత, తనిఖీలో బయటపడ్డ ఉల్లంఘనలు నిరూపితమైనట్లు అవి జరిమానా విధింపతగినవేనని, రిజర్వ్ బ్యాంక్ నిశ్చయించింది. తదనుసారంగా, కంపెనీపై రూ. 5 లక్షల జరిమానా విధించబడింది. (యోగేశ్ దయాల్) పత్రికా ప్రకటన: 2019-2020/910 |