<font face="mangal" size="3">యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియాఫై, భారతీయ రిజర్వ - ఆర్‌బిఐ - Reserve Bank of India
యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియాఫై, భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధింపు
తేది: 15/07/2019 యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియాఫై, భారతీయ రిజర్వు బ్యాంకు జరిమానా విధింపు బ్యాంకుల్లో సైబర్ సెక్యూరిటీ ఫ్రేంవర్క్ పై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) జారీ చేసిన ఆదేశాలను పాటించనందుకు, యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియాఫై జులై 09, 2019 న ఆర్‌బిఐ ₹ 1.00 మిలియన్ జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 46(4)(i), సెక్షన్ 51(1) తో కలిపి సెక్షన్ 47A (1)(c) లో భారతీయ రిజర్వు బ్యాంకు కు ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకొని ఈ జరిమానా విధించబడింది. ఈ చర్య, మార్గదర్శకాలను/ఆదేశాలను బ్యాంకు పాటించనందుకు మాత్రమే తప్ప, బ్యాంకుతో వినియోగదారుల ఏ లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటు ప్రామాణికత పై అభిప్రాయ వ్యక్తీకరణ కాదు. నేపధ్యం బ్యాంక్ యొక్క SWIFT వ్యవస్థ ద్వారా 2016 లో మొత్తం 171 మిలియన్ డాలర్ల విలువైన ఏడు మోసపూరిత సందేశాల ద్వారా బయటబడిన నివేదికల ఆధారంగా, బ్యాంకు యొక్క సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్ పరిశీలన జరుపగా, అది అనేక లోపాలను వెల్లడించింది. కనుగొన్న సమాచారం ఆధారంగా, అమలులో వున్న ఆదేశాలను పాటించడంలో విఫలమైనదన్న ఆరోపణల ఫై, జరిమానా ఎందుకు విధించకూడదు అని బ్యాంకుకు నోటీసు జారీ చేయడం జరిగింది. బ్యాంకు నుండి వచ్చిన ప్రత్యుత్తరాలు మరియు వ్యక్తిగత విచారణ సమయంలో చేసిన సమర్పణలను పరిశీలించిన తరువాత, అనుపాలనలో విఫలత మరియు బ్యాంక్ తీసుకున్న దిద్దుబాటు చర్యల ఆధారంగా పైన ఉదహరించిన జరిమానా విధించాలని నిర్ణయించడమైనది. యోగేష్ దయాళ్ పత్రికా ప్రకటన: 2019-2020/153 |