<font face="mangal" size="3">యునైటెడ్ ఓవర్సీస్ బ్యాంక్ లి., పై, రిజర్వ్ బ్య&# - ఆర్‌బిఐ - Reserve Bank of India
యునైటెడ్ ఓవర్సీస్ బ్యాంక్ లి., పై, రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధించినది
తేదీ: 03/10/2019 యునైటెడ్ ఓవర్సీస్ బ్యాంక్ లి., పై, రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధించినది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వారి ఆదేశం తేదీ అక్టోబర్ 01, 2019 ద్వారా, యునైటెడ్ ఓవర్సీస్ బ్యాంక్ లి., (బ్యాంక్) పై, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 10B లో పేర్కొన్న నిబంధనలు పాటించని కారణంగా, 1 కోటి రూపాయిల, నగదు జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 47A(1)(c), సెక్షన్ 46 (4)(i), తమకు దఖలు పరచిన అధికారాలతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈజరిమానా విధించినది. నియంత్రణా మార్గదర్శకాలు పాటించుటలో లోపాలు జరిగిన కారణంగా ఈ చర్య తీసుకోబడిందేతప్ప. బ్యాంకు, ఖాతాదారులతో జరిపిన లావాదేవీలు / చేసుకున్న ఒప్పందాల చెల్లుబడిమీద, ఇది తీర్మానము కాదు. (యోగేశ్ దయాల్) పత్రికా ప్రకటన: 2019-2020/854 |