RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78484291

బ్యాకింగ్ నియంత్రణ (సవరణ) అధికార శాసనం 2017 (Banking Regulation (Amendment) Ordinance 2017) కార్యప్రణాళిక అమలుకై భారతీయ రిజర్వ్ బ్యాంక్ సూచనలు

తేదీ: మే 22, 2017

బ్యాకింగ్ నియంత్రణ (సవరణ) అధికార శాసనం 2017
(Banking Regulation (Amendment) Ordinance 2017)
కార్యప్రణాళిక అమలుకై భారతీయ రిజర్వ్ బ్యాంక్ సూచనలు

బ్యాంకింగ్ నియంత్రణ (సవరణ) అధికార శాసనం 2017, జారీ తదనంతరం తీసుకొన్న, ఇక పై తీసుకోబోయే చర్యలను, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ రోజు ఒక ప్రకటనలో సూచించింది.

2. అధికార శాసనం (ఆర్డినెన్స్, ordinance) ద్వారా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 లో చేసిన సవరణలు, ఆ తదుపరి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అధికారిక ప్రకటన, భారతీయ రిజర్వ్ బ్యాంకుకు, ఏదైన బ్యాంకింగ్ కంపెనీకి/ కంపెనీలకి ఇన్సాల్వెన్సీ మరియు బ్యాంక్రప్ట్సీ కోడ్, 2016 (IBC) నిబంధనల అనుసారం, రుణాల ఎగవేత సందర్భంలో, దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించడానికి ఆదేశాలు ఇవ్వడానికి, అధికారాన్నిచ్చాయి. భారమవుతున్న ఆస్తుల (stressed assets) విషయంలో కూడా మార్గదర్శకాలు ఇవ్వడానికి, భారతీయ రిజర్వ్ బ్యాంకుకు సాధికారత కల్పించాయి. తదనుసారంగా, భారమయిన రుణాల పరిష్కారంలో బ్యాంకింగ్ కంపెనీలకు సలహా ఇవ్వడానికి, రిజర్వ్ బ్యాంక్ ఒకరు/ అంతకు మించి అధికారులని లేక కమిటీలను తామే నియమించవచ్చు లేదా అట్టి నియామకాలకు అనుమతించవచ్చు.

3. ఆర్డినెన్స్ జారీ చేసిన వెనువెంటనే, ఒత్తిడికి లోనయిన రుణాల విషయంలో తీసుకోవలసిన చర్యలపై ప్రస్తుతం ఉన్న నిబంధనలలో ఈ క్రింది మార్పులు చేస్తూ రిజర్వ్ బ్యాంక్, ఆదేశాలు జారీ చేసింది.

  1. పరిస్థితి సరిదిద్దే చర్యలలో (Corrective Action Plan) భాగంగా సరళమైన పునఃనిర్మాణ (flexible restructuring) మార్గాలు – SDR మరియు S4A - అనుసరించవచ్చని విశదీకరించింది.

  2. రుణదాతల ఉమ్మడి సమాఖ్యలో (Joint Lenders Forum, JLF) సులువుగా నిర్ణయం తీసికోవడానికి, ప్రతిపాదన ఆమోదానికి కావలసిన శాతం 75 నుండి 60 కి తగ్గించడం జరిగింది. అయితే సంఖ్యాపరంగా 50% అలాగే ఉంచబడింది.

  3. JLF అంగీకరించిన ప్రతిపాదనలకు సమ్మతించని అల్పసంఖ్యాక వర్గం, నిర్ణీత సమయంలోపు, సబ్స్టిట్యూషన్‌ నియమాలు (Substitution Rules) పాటించి, వదలిపోవచ్చు లేదా JLF నిర్ణయానికి కట్టుబడి ఉండవచ్చు.

  4. సభ్యులైన బ్యాంకులు, JLF నిర్ణయాలని, అదనపు షరతులు లేకుండా, విధిగా పాటించాలి.

  5. బ్యాంకుల పాలకమండళ్ళు (Boards), JLF నిర్ణయాలని, మళ్ళీ వారి అమోదానికి పంపకుండా, కార్యాచరణలో పెట్టడానికి, వారి ఉద్యోగులకు అధికారమివ్వాలని, సలహా ఇవ్వడం జరిగింది.

ఈ నిబంధనలు పాటించకపోవడం, చర్యలకు దారితీస్తుందని బ్యాంకులకు స్పష్టంచేయబడింది.

4. ప్రస్తుతం, పర్యవేక్షణ సంఘంలో (Oversight Committee) ఇద్దరు సభ్యులు ఉన్నారు. రిజర్వ్ బ్యాంకును సంప్రదించి, ఐ బి ఏ (IBA) దీనిని ఏర్పాటు చేసింది. పర్యవేక్షణ సంఘాన్ని, రిజర్వ్ బ్యాంక్ ప్రాపకంలో పునర్నిర్మించి, సభ్యుల సంఖ్య పెంచాలని నిర్ణయించడం జరిగింది. తద్వారా, పర్యవేక్షణ సంఘం మరిన్ని 'బెంచిలు' కల్పించి, అధిక సంఖ్యలో వారి విచారణకు వచ్చే వ్యవహారాల ఒత్తిడి నిభాయించగలదు. పునర్మించిన పర్యవేక్షణ సంఘంలో, ప్రస్తుత సభ్యులు కొనసాగుతారు. అయితే, అదనంగా మరికొంత మంది పేర్లు ప్రకటించబడతాయి. ప్రస్తుతం S4A క్రింద ఉన్న వ్యవహారాలేగాక, పర్యవేక్షణ సంఘానికి విచారణకు పంపదగిన విషయాల పరిధిని విస్తరించాలని, రిజర్వ్ బ్యాంక్ యోచిస్తోంది.

5. IBC కి పరిష్కారానికి పంపాలని నిశ్చయించిన వ్యవహారాలపై నిష్పాక్షికంగా, ఒకేరీతిలో నిర్ణయాలు తీసికోవడానికి సహకరించే విధాన కల్పనకు, రిజర్వ్ బ్యాంక్ కృషి చేస్తోంది. అతి భారమైన రుణాల ప్రస్తుత స్థితిపై, రిజర్వ్ బ్యాంక్ ఇదివరకే బ్యాంకులనుండి సమాచారం కోరింది. ఈ విషయంలో సలహా ఇవ్వడానికి, రిజర్వ్ బ్యాంక్ - ప్రధానంగా వారి స్వతంత్ర బోర్డ్ సభ్యులతోకూడిన - ఒక సంఘాన్ని ఏర్పాటు చేయబోతోంది.

6. బ్యాంకింగ్ వ్యవస్థలో, అతి భారంగా మారిన ఆస్తులను, వీలయినంత విలువ రాబట్టుకొనే విధంగా పునర్వ్యవస్థీకరణ చేయడానికి, ప్రస్తుత మార్గదర్శకాలలో అవసరమైన సవరణలు, పరిశీలనలో ఉన్నాయి. ఈ వ్యవస్థలో, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలకు ప్రముఖ పాత్ర ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ గమనించింది. రేటింగ్ విషయంలో జోక్యం, ప్రయోజనాల్లో సంఘర్షణ నివారించడానికి, రేటింగ్ బాధ్యతలు ఒప్పగించే నిర్ణయం తామే తీసికోవడం; అందుకై ఖర్చు బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన విరాళాలనుండి చెల్లించడం, వీలవుతుందా అని పరిశీలిస్తోంది.

7. మెరుగుపరిచిన ఈ విధానాలవల్ల ప్రయోజనం పొందాలంటే, అందరు భాగస్వాముల - బ్యాంకులు, ARC లు, రేటింగ్ ఏజన్సీలు, IBBI మరియు PE సంస్థల, సహాయ సహకారాలు ఎంతో అవసరం. ఈ విషయమై, రిజర్వ్ బ్యాంక్, త్వరలో భాగస్వాములందరి సమావేశం ఏర్పాటు చేయనుంది.

8. ఈ విషయమై తాజాపరిణామాలు, అవసరమని భావించినప్పుడు రిజర్వ్ బ్యాంక్, తగిన సమయంలో తెలియపరుస్తుంది.

జోస్ జె కత్తూర్
చీఫ్ జనరల్ మానేజర్

పత్రికా ప్రకటన: 2016-2017/3138

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?