<font face="mangal" size="3">పరిష్కార ప్రక్రియ –2.0: కోవిడ్-19 కారణంగా వ్యక్తు - ఆర్బిఐ - Reserve Bank of India
పరిష్కార ప్రక్రియ –2.0: కోవిడ్-19 కారణంగా వ్యక్తులు మరియు చిన్న వ్యాపారాలపై ఒత్తిడి నివారణ - మొత్తం బకాయిల విలువ పరిమితిలో (త్రెషోల్డ్ ఫర్ అగ్రిగేట్ ఎక్స్పోజర్) సవరింపు
RBI/2021-22/46 జూన్ 04, 2021 అన్ని వాణిజ్య బ్యాంకులు (చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, స్థానిక బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో సహ); ప్రాథమిక (నగర) సహకార బ్యాంకులు/ రాష్ట్ర సహకార బ్యాంకులు/జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు; జాతీయ ఆర్థిక సంస్థలు; బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో సహా) అయ్యా /అమ్మా, పరిష్కార ప్రక్రియ –2.0: కోవిడ్-19 కారణంగా వ్యక్తులు మరియు చిన్న వ్యాపారాలపై ఒత్తిడి నివారణ - మొత్తం బకాయిల విలువ పరిమితిలో (త్రెషోల్డ్ ఫర్ అగ్రిగేట్ ఎక్స్పోజర్) సవరింపు పరిష్కార ప్రక్రియ 2.0 - కోవిడ్-19 కారణంగా వ్యక్తులు మరియు చిన్న వ్యాపారాలపై ఒత్తిడి నివారణ అంశంమీద, మే 5, 2021 తేదీ సర్క్యులర్ DOR.STR.REC.11/21.04.048/2021-22 చూడండి. 2. పై సర్క్యులర్ క్లాజ్ 5, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు అర్హతగల ఋణగ్రహీతలను నిర్వచిస్తుంది. ఈ ప్రక్రియలో ఈక్రింది రెండు సబ్-క్లాజులు ఉన్నాయి: (b) వ్యాపారంకొరకు వ్యక్తులు తీసికొన్న రుణాల మొత్తం (అన్ని ఋణ సంస్థలనుండి) మార్చి 31, 2021 నాటికి రూ. 25 కోట్లకు మించి ఉండరాదు. (c) చిన్న వ్యాపారస్తులు (మార్చి 31, 2021 తేదీనాటికి, ఎమ్ ఎస్ ఎమ్ ఈ లు గా వర్గీకరించబడని చిల్లర, టోకు వర్తకులతో సహా) తీసికొన్న రుణాల మొత్తం (అన్ని ఋణ సంస్థలనుండి) మార్చి 31, 2021 నాటికి రూ. 25 కోట్లకు మించి ఉండరాదు. 3. పరిస్థితిని సమీక్షించి, పైన తెలిపిన పరిమితిని, రూ. 25 కోట్ల నుండి రూ. 50 కోట్లకు పెంచవలెనని నిర్ణయించడం జరిగింది. 4. సర్క్యులర్ లోని ఇతర నిబంధనలలో మార్పులేదు. మీ విశ్వాసపాత్రుడు, (మనోరంజన్ మిశ్రా) |