RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
ODC_S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78528031

పరిష్కార ప్రక్రియ –2.0: కోవిడ్-19 కారణంగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలపై (ఎమ్ ఎస్ ఎమ్ ఈ లు) ఒత్తిడి నివారణ - మొత్తం బకాయిల విలువ పరిమితిలో (త్రెషోల్డ్ ఫర్ అగ్రిగేట్ ఎక్స్పోజర్) సవరింపు

RBI/2021-22/47
DOR.STR.REC.21/21.04.048/2021-22

Jun 04, 2021

అన్ని వాణిజ్య బ్యాంకులు (చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, స్థానిక బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులతో సహ); ప్రాథమిక (నగర) సహకార బ్యాంకులు/ రాష్ట్ర సహకార బ్యాంకులు/జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు; జాతీయ ఆర్థిక సంస్థలు; బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో సహా)

అయ్యా /అమ్మా,

పరిష్కార ప్రక్రియ –2.0: కోవిడ్-19 కారణంగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలపై (ఎమ్ ఎస్ ఎమ్ ఈ లు) ఒత్తిడి నివారణ - మొత్తం బకాయిల విలువ పరిమితిలో (త్రెషోల్డ్ ఫర్ అగ్రిగేట్ ఎక్స్పోజర్) సవరింపు

పరిష్కార ప్రక్రియ 2.0 - కోవిడ్-19 కారణంగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలపై (ఎమ్ ఎస్ ఎమ్ ఈ లు) ఒత్తిడి నివారణ అంశంపై, మే 5, 2021 తేదీ సర్క్యులర్ DOR.STR.REC.12/21.04.048/2021-22 చూడండి.

2. సర్క్యులర్ క్లాజ్ 2 ప్రకారం, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు అర్హతకొరకు, ఇతర అంశాలతోబాటు, సబ్ క్లాజ్ (iii) లో తెలిపినట్లు ఎమ్ ఎస్ ఎమ్ ఈ ఋణగ్రహీత మొత్తం బకాయిలు (అన్ని ఋణ సంస్థల మొత్తంకలిపి, నాన్-ఫండ్ సౌకర్యాలతో సహా) మార్చ్ 31, 2021 నాటికి రూ. 25 కోట్లకు మించి ఉండరాదు.

3. ఈ పరిస్థితి సమీక్షించి, పైన తెలిపిన పరిమితిని, రూ. 25 కోట్ల నుండి రూ. 50 కోట్లకు పెంచవలెనని నిర్ణయించడం జరిగింది.

4. తదనుసారంగా, క్లాజ్ 2 (v) ఈ క్రింది విధంగా సవరించబడింది:

“(v) రుణగ్రహీత ఖాతా, DOR.No.BP.BC/4/21.04.048/2020-21 తేదీ ఆగస్ట్ 6, 2020; DOR.No.BP.BC.34/21.04.048/2019-20 తేదీ ఫిబ్రవరి 11, 2020; లేక DBR.No.BP.BC.18/21.04.048/2018-19 తేదీ జనవరి 1, 2019 (అన్నిటినీ కలిపి ఎమ్ ఎస్ ఎమ్ ఈ పునర్వ్యవస్థీకరణ సర్క్యులర్లు అని పిలవబడతాయి) లేక ‘కోవిడ్-19 కారణంగా కలిగిన ఒత్తిడి పరిష్కార ప్రక్రియ’ (రిసొల్యూషన్ ఫ్రేమ్ వర్క్ ఫర్ కోవిడ్-19- రిలేటెడ్ స్ట్రెస్) మీద DOR.No.BP.BC/3/21.04.048/2020-21 తేదీ ఆగస్ట్ 6, 2020 సర్క్యులర్ల అనుసారంగా, పునర్వ్యవస్థీకరించబడి ఉండరాదు”.

5. సర్క్యులర్ లోని ఇతర నిబంధనలలో మార్పులేదు.

మీ విశ్వాసపాత్రుడు,

(మనోరంజన్ మిశ్రా)
చీఫ్ జనరల్ మానేజర్

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?