<font face="mangal" size="3">సాధారణ ద్రవ్యతా నిర్వహణ కార్యకలాపాల పునరార - ఆర్బిఐ - Reserve Bank of India
సాధారణ ద్రవ్యతా నిర్వహణ కార్యకలాపాల పునరారంభం
జనవరి 08, 2021 సాధారణ ద్రవ్యతా నిర్వహణ కార్యకలాపాల పునరారంభం ఫిబ్రవరి 06, 2020 న, రిజర్వు బ్యాంకు సవరించిన లిక్విడిటీ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించింది, ఇది లిక్విడిటీ మేనేజ్‌మెంట్ ఉద్దేశ్యాలను మరియు సంబంధిత టూల్‌కిట్‌ను సరళీకరించి, స్పష్టంగా తెలియజేసింది. 2. COVID-19 యొక్క ప్రబలవ్యాప్తి దృష్ట్యా, వేగంగా మారుతున్న ఆర్ధిక పరిస్తితులు, ఇంకా లాక్-డౌన్ మరియు సామాజిక దూరం కారణంగా ఏర్పడ్డ వ్యవధానాలను పరిగణనలోకి తీసుకోని, సవరించిన లిక్విడిటీ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు. ఫిక్స్‌డ్ రేట్ రివర్స్ రెపో మరియు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్) కార్యకలాపాల కోసం ఆర్బీఐ విండో, రోజంతా అందుబాటులోకి ఉంచబడింది. దీని ఉద్దేశ్యం పాత్రత గల మార్కెట్ సహభాగులకు వారి ద్రవ్యత్వ నిర్వహణలో అధిక సౌలభ్యం ను ఉపలభ్ధం చేయడం. 3. COVID-19 వల్ల కార్యకలాపాలు చెదురుమదురు అవ్వడం మరియు పెరిగిన ఆరోగ్య రిస్కుల దృష్ట్యా, ఏప్రిల్ 07, 2020 నుండి వివిధ మార్కెట్ విభాగాలకు ట్రేడింగ్ వేళలు కుదించాలని నిర్ణయించారు. తరువాత, దశలవారీగా లాక్-డౌన్ ఎత్తివేయడం మరియు ప్రజా కదలికలు మరియు కార్యాలయాల పనితీరుపై ఆంక్షలు సడలించడం వల్ల, నవంబర్ 09, 2020 నుండి రిజర్వు బ్యాంకు నియంత్రిత మార్కెట్ల ట్రేడింగ్ వేళలను దశలవారీగా పునరుద్ధరించాలని నిర్ణయించారు. 4. వర్తమానo లో లిక్విడిటీ పరిణామo మరియు ఆర్థిక పరిస్థితులను సమీక్షించిన మీదట, సాధారణ లిక్విడిటీ మేనేజ్మెంట్ కార్యకలాపాలను దశలవారీగా పునరుద్ధరించాలని నిర్ణయించారు. దీని ప్రకారం రిజర్వు బ్యాంకు, ఫిబ్రవరి 06, 2020 న జారీఅయిన సవరించిన లిక్విడిటీ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ క్రింద, ఈ క్రింది వేరియబుల్ రేట్ రివర్స్ రెపో వేలం ను శుక్రవారం, జనవరి 15, 2021 న నిర్వహిస్తుంది.
5. ఫిబ్రవరి 13, 2020 నాటి రిజర్వు బ్యాంకు పత్రికా ప్రకటన 2019-2020/1947 లో వేలం కోసం ఇవ్వబడ్డ దిశానిర్దేశాలు అలాగే వర్తిస్తాయి. 6. ఫిక్స్‌డ్ రేట్ రివర్స్ రెపో మరియు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్) కార్యకలాపాలు రోజంతా అందుబాటులో ఉంటాయి. మునుపు డిసెంబర్ 04, 2020 న MPC లో ప్రకటించిన విధంగా, వ్యవస్థలో తగినంత ద్రవ్యం లభ్యమవుతుందని రిజర్వు బ్యాంకు పునరుద్ఘాటించారు. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2020-2021/910 |