RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78513895

బ్యాంకింగ్ మౌళికనిర్మాణం (ఇన్ఫ్రాస్ట్రక్చర్) కోసం కేంద్రీయ సమాచార వ్యవస్థ (CISBI) క్రింద బ్యాంక్ /శాఖల (బ్రాంచ్) వివరాల నమూనాపత్రం (ప్రొఫార్మా) మరియు రిపోర్టింగ్ పునఃపరిశీలన (రివిజన్).

ఆర్.బి.ఐ/2019-20/81
డిసిబిఆర్.బిపిడి(పిసిబి/ఆర్సిబి)సిఐఆర్.నం.04/07.01.000/2019-20.

అక్టోబర్ 11, 2019

ముఖ్య కార్య నిర్వహణాధికారి
అన్ని ప్రాధమిక (అర్బన్)సహకార బ్యాంకులు/
అన్ని రాష్ట్ర సహకార బ్యాంకులు/
అన్ని జిల్లా కేంద్రీయ సహకార బ్యాంకులు

మేడమ్/డియర్ సర్,

బ్యాంకింగ్ మౌళికనిర్మాణం (ఇన్ఫ్రాస్ట్రక్చర్) కోసం కేంద్రీయ సమాచార వ్యవస్థ (CISBI) క్రింద బ్యాంక్ /శాఖల (బ్రాంచ్) వివరాల నమూనాపత్రం (ప్రొఫార్మా) మరియు రిపోర్టింగ్ పునఃపరిశీలన (రివిజన్).

బ్రాంచి బ్యాంకింగ్ గణాంకాలు – త్రైమాసిక వివరణపట్టికల నివేదనల (రిటర్న్స్) - నమూనాపత్రం (ప్రొఫార్మా) I & II ల పునఃపరిశీలన (రివిజన్) పై మా సర్క్యులర్ యూబిడి.సిఓ.యల్.యస్. సిఐఆర్.నం.43/07.01.000/2006-07 తేదీ మే 09, 2007 మరియు ఆర్పిసిడి.సిఓ. ఆర్.యఫ్.నం.బిసి.9/07.06.00/2005-06 తేదీ జులై 06, 2005 లను దయచేసి పరికించండి.

2. భారతీయ రిజర్వు బ్యాంకు దేశంలోని అన్ని బ్యాంక్ శాఖల / కార్యాలయాల/ పరిపాలనాపరంకాని ఇండిపెండెంట్ ఆఫీసులు (NAIOs)/కస్టమర్ సర్విస్ పాయింట్ల (CSPs) డైరెక్టరి [“మాస్టర్ ఆఫీస్ ఫైల్ సిస్టం” (MOF) గా సుపరిచితం] ని నిర్వహిస్తున్నది, ఇది బ్యాంకులు ఈమెయిలు ద్వారా నివేదించే ప్రొఫార్మాI & II ల ద్వారా నవీకరించబడుతుంది. ఈ వ్యవస్థ బ్యాంకు శాఖలకు /కార్యాలయాలకు/NAIOలకు/CSPలకు ప్రాధమిక గణాంకాల రిటర్న్(బియస్ఆర్) కోడ్/ అధీకృత డీలర్ కోడ్ (ఏడి) లను కేటాయిస్తుంది.

3. బ్రాంచ్ లైసెన్సింగ్ మరియు ఆర్ధిక సమీకరణ పాలసీల తో పాటు అదనపు ప్రమాణాలు/ విశేషతలను అవసరoమేరకు కవరేజ్ చేసే ఉద్దేశ్యంతో, పారంపర్యంపు MOF సిస్టం ను రీప్లేస్ చేస్తూ ఒక క్రొత్త రిపోర్టింగ్ సిస్టం, అంటే బ్యాంకింగ్ మౌళికనిర్మాణం (ఇన్ఫ్రాస్ట్రక్చర్) కోసం కేంద్రీయ సమాచార వ్యవస్థ (సిఐయస్బిఐ) (https://cisbi.rbi.org.in), వెబ్-రూపంలో ఏర్పరచబడింది.

4. ప్రొఫార్మా I మరియు ప్రొఫార్మా II లను విడిగా ఈమెయిల్ ద్వారా సమర్పించే మునుపటి వ్యవస్థతో పోలిస్తే ఈ క్రొత్త సిస్టం క్రింద, అన్ని సహకార బ్యాంకులు వారి సమాచారాన్నిఆన్-లైన్లో CISBI పోర్టల్ లో ఒకేవొక ప్రోఫార్మా (అనుబంధం-I) ద్వారా నివేదించాల్సి ఉంటుంది. ఈ కొత్త ప్రొఫార్మా ను ఆన్‌లైన్‌లో సమర్పించడానికి తగుసూచనలు అనుబంధం II లో ఇవ్వబడ్డాయి. బ్యాంకులు సమర్పించిన గత సమాచారాన్నంతా CISBI కు తరలింపుచేయబడింది; ఇకమీదట అదనపు సమాచారాన్ని CISBI లోనే నివేదించాలి. రిపోర్టింగ్ సౌలభ్యం కోసం CISBI పోర్టల్ సంబంధిత సర్క్యులర్లు, యూజర్ సూచికలు మరియు ఇతర సంబంధిత పత్రాలను కలిగి ఉంటుంది.

5. CISBI లో తమ సమాచారాన్ని నివేదించేందుకు బ్యాంకుల నోడల్ అధికారులకు రిజర్వు బ్యాంకు లాగిన్ యోగ్యతాధారాలను అందించింది. mofbsd@rbi.org.in లో ఈ-మెయిల్ అభ్యర్థన చేయడం ద్వారా కూడా CISBI కి ప్రాప్యత పొందవచ్చు. అనుబంధం-3 లో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు CISBI పోర్టల్ పై సమాచారాన్ని సమర్పించాలి, మరి ఆ తదుపరి బ్యాంక్ శాఖ/కార్యాలయం/NAIO/CSP కోడ్ లను CISBI తగిన ధృవీకరణల అనంతరం కేటాయిస్తుంది. స్టేటస్ మార్పు విషయంలో బ్యాంకులు సంబంధిత భాగాన్ని మాత్రమే సవరించాలి. CISBI పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో బ్యాంక్ శాఖలు / కార్యాలయాలు / NAIOలు/CSPలను తెరవడం, మూసివేయడం, విలీనం చేయడం, మార్చడం మరియు పరివర్తనచేయడం వంటి సమాచారాన్ని అన్ని సహకార బ్యాంకులు వెంటనే ఎట్టిపరిస్థితుల్లోనూ ఒక వారం లోపుగా సమర్పించాలి.

6. CISBI లో డేటా యొక్క ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి బ్యాంకులు ప్రతి నెల చివరి వారంలో వారి పనిచేసే శాఖలు, కార్యాలయాలు, NAIOలు, CSP ల మొత్తం సంఖ్యను CISBI లో సూచించి గత నెల చివరిదినంనాటి స్థితి యొక్క NIL రిపోర్ట్ జనరేట్ చేయాలి, మరియు బ్యాంకులు ఈ NIL రిపోర్ట్ ఖచ్చితత్వాన్ని ధృవీకరించిన తర్వాత దీనిని CISBI మాధ్యమం ద్వారా సమర్పించాలి. బ్యాంకులు తమకు సంబంధించిన డేటా ప్రాప్యత (యాక్సెస్)కు / డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించవచ్చు.

7. CISBI లో బ్యాంక్ స్థాయి పూర్తి వివరాలు (ఉదాహరణకు బ్యాంక్ క్యాటగిరి, బ్యాంక్-గ్రూప్, బ్యాంక్ కోడ్, జారీచేసిన లైసెన్స్ రకం, రిజిస్ట్రేషన్ వివరాలు, వ్యాపార ప్రాంతం, కార్యాలయాల చిరునామాలు, ఉన్నతోద్యోగుల పరిచయ వివరాలు, మొదలగునవి) మరియు టైం స్టాంప్ తో గతమార్పుల చరిత్ర నిర్వహణకు పూర్తి అవకాశంఉందని కూడా తెలియపరచడమైంది. తొలిసారిగా సిస్టం ప్రాప్యత (యాక్సెస్) పొందిన తరువాత బ్యాంకులు నివేదన/నవీకరణ హక్కుల అందుబాటుతో సరియైన మరియు నవీకరించబడిన బ్యాంక్ స్థాయి సమాచారాన్ని ఆన్ని ఫీల్డ్ లలోను తప్పక పూరించేట్లు చూడాలి. CISBI పోర్టల్ పై ప్రాధమిక సమాచారం పంపిన తదుపరి "సరియైన మరియు నవీకరించబడిన బ్యాంక్ స్థాయి సమాచారం CISBI లో పంపించబడింది" అని పేర్కొంటూ ఒకపరి నిర్ధారణ, ఈ సర్క్యులర్ జారీ చేసిన ఒక మాసం లోపు బ్యాంకుల సంబంధిత ఆర్బీఐ సహకార బ్యాంకుల పర్యవేక్షణ విభాగం ప్రాంతీయ కార్యాలయానికి పంపబడాలి. బ్యాంక్ స్థాయి సమాచారంలో ఎటువంటి తదుపరి మార్పులున్నా CISBI పోర్టల్ లో నవీకరణ కు బ్యాంకులు తక్షణ ప్రాతిపదికన సమర్పించాలి.

8. ఈ అంశంపై ఇప్పటివరకు జారీ చేసిన అన్ని సూచనలను అధిగమిస్తూ ఈ సూచనలు జారీ చేయబడుతున్నాయి.

మీ విధేయురాలు

(మాలా సిన్హా)
జనరల్ మేనేజర్-ఇన్-ఛార్జ్
జతపరచబడినవి: పైన సూచించినవిధంగా


అనుబంధం III

CISBI వాడకంపై సహకార బ్యాంకులకు మార్గదర్శకాలు

ఆర్బీఐ లోని నియంత్రణవిభాగాలు అంటే బ్యాంకింగ్ నియంత్రణ విభాగం (DBR) మరియు సహకార బ్యాంకుల నియంత్రణ విభాగం (DCBR) వారిచే జారీ చేయబడ్డ ఇపుడున్నబ్రాంచ్ ఆధారైజేషణ్ సర్కులర్ల ప్రకారం, బ్యాంకుల చే రిపోర్ట్ చేయబడిన అన్ని బ్యాంక్ శాఖల / కార్యాలయాల యొక్క లొకేషనల్ మరియు బిజినెస్ కార్యకాలాపాల వివరాల సమాచార బేస్ ను నిర్వహించడానికి రిజర్వు బ్యాంకు మాస్టర్ ఆఫీస్ ఫైల్ (MOF) సిస్టం ను ఉపయోగిస్తోంది. ఈ MOF సిస్టం ద్వారా బేసిక్ స్టాటిస్టికల్ రిటర్న్స్ (BSR) కోడ్స్ (పార్ట్-I & II) లను కేటాయిస్తారు.

2. బ్రాంచ్ లైసెన్సింగ్ మరియు ఆర్ధిక సమీకరణ పాలసీల తో పాటు అదనపు ప్రమాణాలు/ విశేషతలను సురక్షితమైన పద్ధతిలో అవసరoమేరకు కవరేజ్ చేసే ఉద్దేశ్యంతో, ఈ MOF సిస్టం వెబ్-రూపంలో ఏర్పరచబడిన ఒక క్రొత్త రిపోర్టింగ్ సిస్టం “బ్యాంకింగ్ మౌళికనిర్మాణం (ఇన్ఫ్రాస్ట్రక్చర్) కోసం కేంద్రీయ సమాచార వ్యవస్థ (సిఐయస్బిఐ - CISBI)” చే పునఃస్థాపించబడింది. భారతీయ రిజర్వు బ్యాంకు, డిపార్టుమెంట్ అఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ (DSIM) లోని బ్యాంక్ బ్రాంచ్ స్టాటిస్టిక్స్ డివిజన్ (BBSD) ఈ సిఐయస్బిఐ - CISBI కు నోడల్ యూనిట్ గా ఉండి ఆర్బీఐ ఇతర విభాగాలు, బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థలు మరియు స్టేక్ హోల్డర్స్ తో సమన్వయం చేస్తుంది.

3. ఈ కొత్త సిస్టం క్రింద, బ్యాంకులు వారి బ్యాంక్, బ్రాంచ్, కార్యాలయం, NAIOలు, ఇతర స్థిర కస్టమర్ సర్వీస్ పాయింట్ ల (CSP) (ఉదాః ఎటియంలు,మొదలగు) సంబంధిత సమాచారాన్ని CISBI లో నే సమర్పించాలి. CISBI లో ప్రాప్యత కోసం, ప్రతి బ్యాంక్ కు రెండు రకాల యూజర్ ID లు (i) ‘బ్యాంక్ అడ్మిన్ ID’ మరియు (ii) ‘బ్యాంక్ యూజర్ ID’ కేటాయించబడతాయి. RBI (DSIM-BBSD) ప్రతి బ్యాంక్ కు వొక్క ‘బ్యాంక్ అడ్మిన్ ID’ ను సృష్టించుతుంది. తమ వంతుగా ఆ బ్యాంక్ ‘బ్యాంక్ అడ్మిన్ ID’ ఉపయోగించడం ద్వారా బహుళ “బ్యాంక్ యూజర్ ID” లను సృష్టించగలుగుతుంది. ‘బ్యాంక్ అడ్మిన్ ID’ ఉపయోగించడం ద్వారా తమ బ్యాంక్ కు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత బ్యాంక్ నవీకరణ చేయగలుగుతుంది. ఈ రెండు ID లను ఉపయోగించడం ద్వారా బ్యాంక్ వారి క్రొత్త బ్రాంచ్ లు/కార్యాలయాలు/NAIOలు/CSPలను రిపోర్ట్ చేయగలుగుతుంది; ఇంకా ఏవైనా మార్పులు ఉన్నా, అంటే ఇపుడున్నబ్రాంచ్ లు/కార్యాలయాలు/NAIOలు/CSPల స్టేటస్ / చిరునామా, వీటిని మూయడం/ విలీనంచేయడం/ రూపాంతరంచేయడం/రీ-లొకేషన్/ నవీకరణ, etc గురించి రిపోర్ట్ చేయగలుగుతుంది. అయితే ‘బ్యాంక్ అడ్మిన్ ID’ ను ఉపయోగించడం ద్వారా మాత్రమే (‘బ్యాంక్ యూజర్ ID’ తో కాదు) వారి బ్యాంక్ కు సంబంధించిన సమాచారం లోని మార్పులను ఆ బ్యాంక్ వెలిబుచ్చగలుగుతుంది.

4. అన్ని సహకార బ్యాంకులు CISBI పోర్టల్ లో పై సమాచారాన్ని సమర్పించాలి. దీనిని ఆర్బీఐ సక్రమమని ప్రకటించి పబ్లిష్ చేస్తుంది. ‘బ్యాంక్ అడ్మిన్ ID’ ని పొందడానికి, బ్యాంక్ తన అధీకృత ఈ-మెయిల్ ID ను పంపాలి; దీని ద్వారా ఆర్బీఐ (DSIM-BBSD) ‘బ్యాంక్ అడ్మిన్ ID’ మరియు దాని పాస్వర్డ్ లను రెండు విడివిడి ఈ మెయిల్స్ లో పంపుతుంది. ఏ బ్యాంక్ ఐనా క్రొత్తగా CISBI లో రిపోర్టింగ్ ప్రాప్యత కొరకై బ్యాంక్ నోడల్ అధికారి వివరాలు, లాగిన్ యోగ్యాతాధారాలు పొందడానికి వారి ఈ-మెయిల్ ID మరి ఈ క్రింద వివరించిన కొన్ని డాకుమెంట్ల తో ఒక విన్నపం ద్వారా ఆర్బీఐ (DSIM-BBSD) ను సంప్రదించాలి:

  1. కోఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రార్ / కేంద్రీయ కోఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రార్ నుండి బ్యాంక్ సంస్థాపనం సర్టిఫికేట్.

  2. ఆర్బీఐ నుండి బ్యాంకింగ్ బిజినెస్ నిర్వహణకు పొందిన లైసెన్స్ / ఆధరైజేషణ్.

  3. ఇండియాలో బిజినెస్ మొదలిడినట్లు ఒక లేఖ.

  4. బ్యాంక్ వారి బిజినెస్ ఆరంభమైనదని ఆర్బీఐ జారీచేసిన పత్రికా ప్రకటన

  5. రిజిస్టర్డ్ ఉపనిబంధనల వొక ప్రతి.

5. పైన పేర్కొన్న డాకుమెంట్ల ఆధారంతో, ఆర్బీఐ (DSIM-BBSD) CISBI సిస్టం నందు ఆ బ్యాంక్ ప్రాధమిక వివరాలను నింపడం ద్వారా CISBI లో బ్యాంక్ యొక్క ఖాతాను తెరుస్తారు.

6. ఈ సిస్టం ‘బ్యాంక్ అడ్మిన్ ID’ ని జనరేట్ చేసి, స్వయంచాలకంగా బ్యాంక్ అధీకృత ఈ-మెయిల్ ID నకు ‘బ్యాంక్ అడ్మిన్ ID’ మరియు దాని పాస్వర్డ్ నకు సంబంధించి ఈ-మెయిల్ నోటిఫికేషన్‌లను (రెండు విదివిడ్ ఈ-మెయిల్స్) ద్వారా) పంపుతుంది.

7. బ్యాంక్ తనకు కేటాయించబడిన ‘బ్యాంక్ అడ్మిన్ ID’ ని ఉపయోగించి CISBI పోర్టల్ (https://cisbi.rbi.org.in) లో లాగిన్ అవ్వాలి మరి మొదటి లాగిన్‌లో కేటాయించిన పాస్‌వర్డ్‌ను మార్చాలి.

8. బ్యాంక్, బ్యాంక్ సంబంధిత సమాచారంనంతా నింపి CISBI పోర్టల్ లో సమర్పించాలి. ఆర్బీఐ ఈ సమాచారాన్ని ధ్రువీకరించి CISBI లో పబ్లిష్ చేస్తుంది.

9. బ్యాంక్ కు సంబంధించిన పూర్తి సమాచారం సమర్పించిన తరువాత CISBI, బ్యాంక్ కోడ్ మరియు బ్యాంక్ వర్కింగ్ కోడ్ లను జనరేట్ చేస్తుంది.

10. బ్యాంక్ కోడ్ మరియు బ్యాంక్ వర్కింగ్ కోడ్ లను పొందిన తరువాత, బ్యాంక్ వారి అంతర్గత యూజర్ల కోసం ‘బ్యాంక్ యూజర్ ఐడి-ID’ లను సృష్టించగలదు.

11. ‘బ్యాంక్ అడ్మిన్ ID’ లేదా ‘బ్యాంక్ యూజర్ ID’ తో లాగిన్ చేయడం ద్వారా, బ్యాంక్ వారి క్రొత్త బ్రాంచ్/కార్యాలయం/NAIOలు/CSPలకు సంబంధించిన సమాచారాన్ని ప్రొఫార్మా ప్రకారం సమర్పించవచ్చు.

12. ఇప్పటికే ఉన్న సమాచారంలో ఏదైనా మార్పును నివేదించడానికి, బ్యాంకులు ప్రస్తుత సమాచారాన్ని సవరించి మరి యే తెదీ నుండి మార్పుజరిగిందో సూచించాలి.

13. బ్యాంకులు తమకు సంబంధించిన డేటా ప్రాప్యత (యాక్సెస్)కు / డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించవచ్చు.

14. “ప్రొఫార్మా ను ఆన్‌లైన్‌లో సమర్పించడానికి తగుసూచనలు” అనుబంధం II లో ఇవ్వబడ్డాయి.

15. ప్రతి మూడు మాసాలకొకసారి బ్యాంకులు పాస్‌వర్డ్‌ను తప్పక రీసెట్ చేయాలి. పాస్వర్డ్ గడువు ముగిసినట్లయినా లేదా దానిని మరచిపోయినా, వారు CISBI లో లాగిన్ అయి (a) ‘బ్యాంక్ యూజర్ ఐడి-ID’ పాస్వర్డ్ ను రీసెట్ చేయాడానికై ‘బ్యాంక్ అడ్మిన్ ID’ ని ఉపయోగించాలి; మరి (b) ‘బ్యాంక్ అడ్మిన్ ID’ ని రీసెట్ చేయాడానికి CISBI హెల్ప్-డెస్క్ ను సంప్రదించాల్సివుంటుంది.

16. అన్ని మార్పులు సిస్టంలో ప్రతిబింబించి మరి తదనుగుణంగా డేటాబేస్ లోకి వెళ్ళడం అనేది ఆర్బిఐ ఆమోదం పొందిన తరువాత మాత్రమే జరుగుతుంది.

17. NIL రిపోర్ట్: NIL నివేదిక (రిపోర్ట్) CISBIలో బ్యాంక్ స్థితిని అంటే నెల చివరి రోజుకు పనిచేస్తున్న అలాగే ఆ మాసంలో తెరిచిన/మూయబడిన ఆ బ్యాంక్ శాఖలు/కార్యాలయాలు/ NAIOలు/ఇతరకస్టమర్ సర్వీస్ పాయింట్ ల (CSPలు) (ఎటియంలు, మొదలగు) సంఖ్యను చూపుతుంది. CISBI నుండే ఈ నివేదిక రూపొందిచబడుతుంది, అంతేగాకుండా CISBI లోని ఈ సమాచారం సరియైనదని మరియు నవీకరించబడిందని బ్యాంకులు ధృవీకరించాలి. CISBI రూపొందించిన NIL నివేదికతో బ్యాంక్ వాస్తవ స్థితి కి ఒకవేళ ఏదైనా తేడాను బ్యాంక్ గనుక కనుగొంటే, ముందు బ్యాంక్ ఆ సమాచారాన్నిCISBI లో అప్-డేట్ చేసి NIL నివేదిక ను జనరేట్ చేసి దానిని CISBI ద్వారా సమర్పించాలి. (భౌతికoగా ప్రతి అవసరం లేదు).

18. ప్రతి నెలా చివరి వారంలో సహకార బ్యాంకులు పూర్వమాస చివరిరోజు జనరేట్ చేయబడిన బ్యాంక్ స్థాయి NIL నివేదిక ను ధృవీకరించి CISBI నందు సమర్పించాలి. ఉదాహరణకు, జూన్, 2019 నెలకు సంబంధించిన NIL నివేదికను జూలై, 2019 చివరి వారంలో జనరేట్ చేసి సమర్పించాలి.

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?