<font face="mangal" size="3">చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల సవరణ</font> - ఆర్బిఐ - Reserve Bank of India
చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల సవరణ
RBI/2015-16/362 ఏప్రిల్ 7, 2016 చైర్‌మన్/ చీఫ్ ఎక్జెక్యూటివ్ ఆఫీసర్ భవిష్య నిధి (Public Provident Fund) / కిసాన్ వికాస్ పత్రాలు-2014 (Kisan Vikas Patra 2014), సుకన్య సమృద్ధి ఖాతాలు, (Sukanya Samriddhi Accounts) వయోవృద్ధుల పొదుపు పథకం-2004 (Senior Citizen Saving Scheme-2004), కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రాతినిధ్య బ్యాంకులకు అయ్యా/ అమ్మా, చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల సవరణ పై విషయంపై మా సర్క్యులర్ RBI/2014-15/536, ఏప్రిల్ 1, 2015, దయచేసి చూడండి. భారత ప్రభుత్వం, వారి ఆఫీస్ మెమోరాండం (OM) NO.F.N0.1/04/2016-NS.II, మార్చ్ 18, 2016 ద్వారా, ఆర్థిక సంవత్సరం 2016-17, మొదటి త్రైమాసికానికి, వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై, సవరించిన వడ్డీ రేట్లు ప్రకటించింది (ప్రతి జత పరచబడింది). 2. ఈ సర్క్యులర్ లోని వివరాలు, ప్రభుత్వ చిన్న పొదుపు పథకాలు నిర్వహించే, మీ బ్యాంక్ శాఖల దృష్టికి తేవలెను. ఈ పథకాల్లో సభ్యుల సమాచారానికై, ఈ వివరాలు మీ బ్యాంక్ శాఖల నోటీస్ బోర్డులలో ప్రదర్శించవలెను. విధేయులు (వి. ఎస్. ప్రాజిష్) జతపరచినవి : పైన తెలిపిన విధంగా |