<font face="mangal" size="3">చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల సవరణ</font> - ఆర్బిఐ - Reserve Bank of India
చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల సవరణ
RBI/2016-17/6 జులై 7, 2016 చైర్‌మన్/ చీఫ్ ఎక్జెక్యూటివ్ ఆఫీసర్ అయ్యా/ అమ్మా, చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల సవరణ పై విషయంపై మా సర్క్యులర్ DGBA.GAD.3175/15.02.005/2015-16, ఏప్రిల్ 7, 2016, దయచేసి చూడండి. భారత ప్రభుత్వం, వారి ఆఫీస్ మెమోరాండం (OM) NO.F.N0.1/04/2016-NS.II, జూన్ 20, 2016 ద్వారా, ఆర్థిక సం వత్సరం 2016-17, రెండవ త్రైమాసికానికి, వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై, సవరించిన వడ్డీ రేట్లు ప్రకటించింది (ప్రతి జత పరచబడింది). 2. ఈ సర్క్యులర్ లోని వివరాలు, ప్రభుత్వ చిన్న పొదుపు పథకాలు నిర్వహించే, మీ బ్యాంక్ శాఖల దృష్టికి తేవలెను. ఈ పథకాల్లో సభ్యుల సమాచారానికై, ఈ వివరాలు మీ బ్యాంక్ శాఖల నోటీస్ బోర్డులలో ప్రదర్శించవలెను. విధేయులు (వి. ఎస్. ప్రాజిష్) జతపరచినవి : పైన తెలిపిన విధంగా |