<font face="mangal" size="3px">రోన్ తాలూకా ప్రైమరీ టీచర్స్’ కో-ఆపరేటివ్ క్&# - ఆర్బిఐ - Reserve Bank of India
రోన్ తాలూకా ప్రైమరీ టీచర్స్’ కో-ఆపరేటివ్ క్రెడిట్ బ్యాంక్ లిమిటెడ్, రోన్, కర్ణాటక పై - జరిమానా విధింపు.
నవంబర్ 26, 2019 రోన్ తాలూకా ప్రైమరీ టీచర్స్’ కో-ఆపరేటివ్ క్రెడిట్ బ్యాంకింగ్ నియంత్రణ చట్టo, 1949 సెక్షన్ 47ఏ(1)(సి)తో పాటు సెక్షన్ 46(4) (కోఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు) నిబంధనల ప్రకారం, భారతీయ రిజర్వు బ్యాంకు తమకు సంక్రమించిన అధికారాలతో రోన్ తాలూకా ప్రైమరీ టీచర్స్’ కో-ఆపరేటివ్ క్రెడిట్ బ్యాంక్ లిమిటెడ్, రోన్ పై సెక్షన్ 27(2) బ్యాంకింగ్ నియంత్రణ చట్టం , 1949 క్రింద వివరణ పట్టికలను (రిటర్న్స్) సమర్పించనందులకు ₹ 0.20 లక్షల (ఇరవై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించింది. 2. భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన షోకాజ్ నోటీసుకు బ్యాంక్ వారు వైయక్తిక వినతిని అభ్యర్ధించారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన నిజానిజాలు మరియు బ్యాంక్ ఇచ్చిన సమాధానo పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినవై, అవి నగదు జరిమానా విధించదగినవేనని, రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చినది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2019-2020/1265 |