RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78509704

రుపీ డ్రాయింగ్ అరేంజ్మెంట్ – అత్యవసర పరిస్థితులలో పౌర సహాయ సహకారాల కొరకు, ప్రధానమంత్రి నిధికి చెల్లింపు (పి ఎమ్ కేర్స్) ఫండ్)

RBI/2019-20/208
A.P. (DIR Series) Circular No. 28

మార్చి 03, 2020

అన్ని ఆతరైజ్డ్ డీలర్ క్యాటగిరి – I బ్యాంకులకు

రుపీ డ్రాయింగ్ అరేంజ్మెంట్ – అత్యవసర పరిస్థితులలో
పౌర సహాయ సహకారాల కొరకు, ప్రధానమంత్రి నిధికి
చెల్లింపు (పి ఎమ్ కేర్స్) ఫండ్)

ఆతరైజ్డ్ డీలర్ క్యాటగిరి – I బ్యాంకులు, దయచేసి రుపీ డ్రాయింగ్ అరేంజ్మెంట్ (ఆర్ డి ఎ) సదుపాయం ద్వారా అనుమతించబడిన లావాదేవీలకు సంబంధించి, జనవరి 01, 2016 న జారీచేసిన “మాస్టర్ డైరెక్షన్ – నాన్ రెసిడెంట్ ఎక్స్చేంజ్ హౌసెస్ ద్వారా రుపీ / ఫారిన్ కరెన్సీ వోస్ట్రో అకౌంట్లు తెరచుట మరియు నిర్వహణ”, పేరాగ్రాఫ్ 4, చూడవలెను.

2. కోవిడ్–19 వ్యాధి విజృంభణ కారణంగా, భారత ప్రభుత్వంతో సంప్రదించి, నాన్-రెసిడెంట్లు “అత్యవసర పరిస్థితులలో పౌర సహాయ సహకారాల కొరకు ప్రధానమంత్రి నిధికి  (పి ఎమ్ కేర్స్ – ఫండ్)”, నాన్-రెసిడెంట్ ఎక్స్చేంజ్ హౌసెస్  ద్వారా పంపించే విదేశీ మారక ద్రవ్య విరాళాలు,  అంగీకరించవచ్చని నిర్ణయించడం జరిగింది.  అయితే, ఆతరైజ్డ్ డీలర్, క్యాటగిరి I బ్యాంకులు, ఈసొమ్మును తిన్నగా నిధికి జమచేయాల్సి ఉంటుంది. ఇంతేగాక, నిధులు పంపినవారి పూర్తి వివరాలు నమోదుచేసి  ఉంచవలెను.  

3. “నాన్ – రెసిడెంట్ ఎక్స్చేంజ్ హౌసెస్ రుపీ / విదేశీ మారక వోస్ట్రో ఖాతాలు తెరచుట మరియు నిర్వహణ తేదీ జనవరి 01, 2016”, మాస్టర్ డైరెక్షన్లో తదనుసారంగా మార్పులు చేయబడతాయి.  

4.  ఈ సర్క్యులర్ లోని ఆదేశాలు, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం, 1999 (1999 లో 42 వది), సెక్షన్ 10 (4) మరియు 11 (1) క్రింద, ఇతర చట్ట  పరమైన ఉత్తరువులు / అనుమతులకు భంగం కానివిధంగా, జారీచేయబడ్డాయి.

మీ విశ్వాసపాత్రులు,

(అజయ్ కుమార్ మిశ్రా)
చీఫ్ జనరల్ మానేజర్ ఇన్-చార్జ్

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?