<font face="mangal" size="3">హెల్డ్ టు మెచూరిటి క్యాటగిరి లో ఉన్న సెక్యూĸ - ఆర్బిఐ - Reserve Bank of India
హెల్డ్ టు మెచూరిటి క్యాటగిరి లో ఉన్న సెక్యూరిటీల విక్రయాలు – అకౌంటింగ్ చేసెడువిధము
ఆర్.బి.ఐ/2018-19/205 జూన్ 10, 2019 చీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్లు మేడమ్/డియర్ సర్, హెల్డ్ టు మెచూరిటి క్యాటగిరి లో ఉన్న సెక్యూరిటీల విక్రయాలు – అకౌంటింగ్ చేసెడువిధము పరిపక్వత (మెచూరిటి) అయ్యేంత వరకు ఉంచాలానే ఉద్దేశ్యంతో బ్యాంకులు గడించిన సెక్యూరిటీలు హెచ్.టి.యం క్యాటగిరి క్రింద వర్గీకరించబడతాయని సూచిస్తున్న జులై 01, 2015 వ తేదీ నాటి ప్రాధమిక (అర్బన్) సహకార (కో-ఆపరేటివ్) బ్యాంకుల పెట్టుబడుల మీది మాస్టర్ సర్కులర్ డిసిబీఆర్/బిపిడి(పిసిబి)/యంసి. నం.4/16.20.000/ 2015-16 - లోని పేరా 16.2 ను దయచేసి పరికించండి. 2. ఈ సందర్భంగా, పునరుద్ఘాటించేదేమిటంటే యుసిబి లు హెచ్.టి.యం క్యాటగిరి క్రింద ఉంచిన సెక్యూరిటీలను విక్రయించే ప్రయత్నం చేయబోవని ఆశిస్తున్నాము. ఒకవేళ ద్రవ్యలభ్యత ఒత్తిడి వల్ల యుసిబి లు హెచ్.టి.యం సముచ్చయం నుండి సెక్యూరిటీలను విక్రయించవలసివస్తే, అటువంటి విక్రయ హేతుబద్ధతను స్పష్టంగా నమోదుచేసి బోర్డు డైరెక్టర్ల అనుమతి తో వారు చేయవచ్చు. హెచ్.టి.యం క్యాటగిరి లో పెట్టుబడుల విక్రయంపై వచ్చిన లాభాన్ని ముందుగా లాభ నష్టాల ఖాతా కు లెక్కించాలి; అటుపిమ్మట, చట్టబద్ధ కేటాయింపుల తదుపరి అటువంటి లాభ మొత్తాన్ని ఆ యేటి నికర లాభం నుంచి క్యాపిటల్ రిజర్వు కు వినియోగించాలి. విక్రయం పై నష్టoను విక్రయం జరిపిన యేటి లాభ నష్టాల ఖాతా లోకి గుర్తించాలి. మీ విధేయులు నీరజ్ నిగమ్ |