<font face="mangal" size="3">ఋణ గ్రహీతల నిర్దేశిత (స్పెసిఫైడ్) ఋణ ఖాతాల్ల - ఆర్‌బిఐ - Reserve Bank of India
ఋణ గ్రహీతల నిర్దేశిత (స్పెసిఫైడ్) ఋణ ఖాతాల్లో ఆరు మాసాలకు చక్రవడ్డి కి మరియు బారువడ్డి కి మధ్య వ్యత్యాసం ను ఎక్స్-గ్రేషియా గా చెల్లింపు మంజూరు పధకం (1.3.2020 నుండి 31.8.2020)
ఆర్‌బిఐ/2020-21/61 అక్టోబర్ 26, 2020 అన్ని వాణిజ్య బ్యాంకులు (చిన్న ఆర్ధిక బ్యాంకులు/ లోకల్ ఏరియా బ్యాంకులు మరియు మేడమ్/డియర్ సర్, ఋణ గ్రహీతల నిర్దేశిత (స్పెసిఫైడ్) ఋణ ఖాతాల్లో ఆరు మాసాలకు చక్రవడ్డి కి మరియు బారువడ్డి కి మధ్య వ్యత్యాసం ను ఎక్స్-గ్రేషియా గా చెల్లింపు మంజూరు పధకం (1.3.2020 నుండి 31.8.2020). భారత ప్రభుత్వం అక్టోబర్ 23, 2020 న, నిర్దేశిత (స్పెసిఫైడ్) ఋణ ఖాతాల్లో (1.3.2020 నుండి 31.8.2020) రుణగ్రహీతలకు ఆరు నెలల పాటు చక్రవడ్డి మరియు సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసాన్ని ఎక్స్-గ్రేషియా గా చెల్లింపు మంజూరు పధకం(ది స్కీం)ను ప్రకటించింది. ఈ పధకం మార్చి 1, 2020 నుండి ఆగస్టు 31, 2020 మధ్య కాలంలో సంబంధిత రుణ మంజూరు సంస్థల ద్వారా సాధారణ వడ్డీ మరియు చక్రవడ్డీ మధ్య వ్యత్యాసాన్ని జమ చేయడం ద్వారా కొన్ని వర్గాల రుణగ్రహీతలకు ఎక్స్-గ్రేషియా చెల్లింపును తప్పనిసరి చేస్తుంది. పథకం యొక్క వివరాలు క్రింది సైట్ లోఅందుబాటులో ఉన్నాయి: https://financialservices.gov.in/sites/default/files/Scheme%20Letter.pdf. 2. అన్ని ఋణమంజూరు సంస్థలు సూచించినట్లుగా పధకం యొక్క నిబంధనల ప్రకారం నడచుకోవాలి మరియు నిర్ణీత కాలపరిమితిలో అవసరమైన చర్యలు తీసుకోవాలి. మీ విధేయులు (ప్రకాష్ బలియార్ సింగ్) |