<font face="mangal" size="3">బ్యాంకింగ్ రెగ్యులేష‌న్ చ‌ట్టం, 1949లోని సెక్ష&zw - ఆర్బిఐ - Reserve Bank of India
బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949లోని సెక్షన్ 23 - శాఖల లైసెన్సింగ్ పై మాస్టర్ సర్క్యులర్ - 2011 జనగణన వివరాలు
RBI/2016-17/134 నవంబర్ 16, 2016 అన్ని స్థానిక గ్రామీణ బ్యాంకులకు డియర్ సర్/మేడమ్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949లోని సెక్షన్ 23 - శాఖల లైసెన్సింగ్ పై మాస్టర్ సర్క్యులర్ - 2011 జనగణన వివరాలు శాఖల లైసెన్సింగ్ పై మేము జులై 01, 2015న జారీ చేసిన మాస్టర్ సర్క్యులర్ నెం. DBR.CO.RRB.BL.BC.No.17/31.01.002/2015-16 ను గమనించండి. 2011 జనాభా లెక్కలు ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్న నేపథ్యంలో స్థానిక గ్రామీణ బ్యాంకులు అన్ని రకాల వర్గీకరణలకు 2011 జనాభా లెక్కలను చూడాలని ఆదేశించడమైనది. 2011 జనాభా లెక్కలను అనుసరించి శ్రేణుల (Tier) వారీ జనాభా బృందాలు, అండర్ బ్యాంక్డ్ రాష్ట్రాలలో ఉన్న అండర్ బ్యాంక్డ్ జిల్లాల జాబితా, ఇతర రాష్ట్రాలలోని అండర్ బ్యాంక్డ్ జిల్లాల జాబితాను Annex 1, 2, 3 లలో జత పర్చడం జరిగింది. మీ విశ్వసనీయులు, (ఎస్. ఎస్. బారిక్) Encl. పైన పేర్కొన్నవి |