<font face="mangal" size="3">ఆర్ బీ ఐ డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్ గా నియ‌మితులైన శ& - ఆర్బిఐ - Reserve Bank of India
ఆర్ బీ ఐ డిప్యూటీ గవర్నర్ గా నియమితులైన శ్రీ బీ.పీ.కనుంగో
ఏప్రిల్ 03, 2017 ఆర్ బీ ఐ డిప్యూటీ గవర్నర్ గా నియమితులైన శ్రీ బీ.పీ.కనుంగో శ్రీ బీ.పీ.కనుంగో ఇవాళ భారత రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు. భారత ప్రభుత్వం మార్చి 11, 2017న ఆయనను భారత రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ గా నియమించింది. ఆయన ఏప్రిల్ 03, 2017న, లేదా ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించిన తేదీ నాటి నుండి మూడేళ్ల కాలం పాటు లేదా తదుపరి ఆదేశాలు అందేవరకు, ఏది ముందైతే అది, ఆ పదవిలో కొనసాగుతారు. శ్రీ కనుంగో డిప్యూటీ గవర్నర్ గా పదోన్నతి పొందే ముందు రిజర్వ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు. డిప్యూటీ గవర్నర్ గా శ్రీ కనుంగో కరెన్సీ నిర్వహణ శాఖ (DCM), విదేశీ పెట్టుబడులు మరియు కార్యకలాపాల విభాగం (DEIO). ప్రభుత్వ మరియు బ్యాంక్ అకౌంట్ల విభాగం (DGBA). ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం (DIT). చెల్లింపులు మరియు పరిష్కారాల వ్యవస్థ విభాగం (DPSS). విదేశీ మారకద్రవ్య విభాగం (FED), అంతర్గత రుణ వ్యవస్థ నిర్వహణ విభాగం (IDMD), న్యాయ విభాగం (LD) మరియు ప్రిమైసెస్ విభాగాల(PD)ను చూసుకుంటారు. శ్రీ కనుంగో, సెప్టెంబర్ 1982లో భారత రిజర్వ్ బ్యాంక్ లో కెరీర్ సెంట్రల్ బ్యాంకర్ గా చేరారు. ఆయన విదేశీ మారకద్రవ్య నిర్వహణ, బ్యాంకింగ్ మరియు నాన్ బ్యాంకింగ్ సూపర్ విజన్, కరెన్సీ నిర్వహణ, ప్రభుత్వ మరియు బ్యాంక్ అకౌంట్లు మరియు ప్రభుత్వ రుణాలు తదితర విభాగాలలో బాధ్యతలు నిర్వహించారు. జైపూర్, కోల్కతా రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ శాఖల అధిపతిగా బాధ్యతలు నిర్వహించారు. వాటితో పాటు మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లలో బ్యాంకింగ్ ఆంబుడ్స్మన్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఆయన విదేశీ మారకద్రవ్య నిర్వహణ, అంతర్గత రుణ నిర్వహణ మరియు ప్రభుత్వ మరియు బ్యాంక్ అకౌంట్ల బాధ్యతలు నిర్వర్తించారు. మే 5, 1959న జన్మించిన శ్రీ కనుంగో, ఉత్కళ్ యూనివర్సిటీ నుంచి హ్యుమానిటీస్ లో మాస్టర్ డిగ్రీ పట్టాను పొందారు. దాంతోపాటు ఆయన న్యాయ శాస్త్రంలో కూడా బ్యాచిలర్స్ డిగ్రీ పట్టాను పొందారు. జోస్ జె.కట్టూర్ ప్రెస్ రిలీజ్: 2016-17/2659 |