<font face="mangal" size="3">శ్రీ భావుసాహెబ్ థోరాట్ అమృత్వాహిని సహకారి బ - ఆర్బిఐ - Reserve Bank of India
శ్రీ భావుసాహెబ్ థోరాట్ అమృత్వాహిని సహకారి బ్యాంక్ లిమిటెడ్, గులేవాడి, అహ్మద్ నగర్ – జరిమానా విధింపు
తేది: 25/07/2019 శ్రీ భావుసాహెబ్ థోరాట్ అమృత్వాహిని సహకారి బ్యాంక్ లిమిటెడ్, గులేవాడి, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (సహకార సంఘాలకు వర్తించే విధంగా) సెక్షన్ 46(4) తో కలిపి, సెక్షన్ 47A(1)(c) క్రింద ప్రదానం చేసిన అధికారాలను వినియోగించుకొని, యుసిబిల ద్వారా డివిడెండ్ ప్రకటించడం పై, భారతీయ రిజర్వు బ్యాంకు యొక్క ఆదేశాలు/ సూచనలు/మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు, శ్రీ భావుసాహెబ్ థోరాట్ అమృత్వాహిని సహకారి బ్యాంక్ లిమిటెడ్, గులేవాడి, అహ్మద్ నగర్ ఫై, భారతీయ రిజర్వు బ్యాంకు ₹ 1.00 (లక్ష రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. భారతీయ రిజర్వు బ్యాంకు జారీచేసిన షో-కాజ్ నోటీసుకు ప్రతిస్పందనగా బ్యాంక్ లిఖిత పూర్వక సమాధానాన్ని సమర్పించింది. కేసులోని వాస్తవాలను, బ్యాంక్ ప్రత్యుత్తరం పరిశీలించిన తరువాత, ఈ విషయంలో బ్యాంకు యొక్క ఉల్లంఘన వాస్తవమని మరియు జరీమానా విధించదగినదిగా భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. యోగేష్ దయాళ్ పత్రికా ప్రకటన సంఖ్య : 2019-2020/246 |