శ్రీ కన్యకా నగరి సహకారి బ్యాంక్ లి., చంద్రపూర్ – జరిమానా విధింపు
తేదీ: 05/02/2019 శ్రీ కన్యకా నగరి సహకారి బ్యాంక్ లి., చంద్రపూర్ – జరిమానా విధింపు రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించే మేరకు), సెక్షన్ 47A(1)(c) [సెక్షన్ 46 (4) తో కలిపి], తమకు దఖలు పరచిన అధికారాలతో, శ్రీ కన్యకా నగరి సహకారి బ్యాంక్ లి., చంద్రపూర్‌పై, రూ. 1.00 లక్ష (కేవలం ఒక లక్ష రూపాయిలు) నగదు జరిమానా విధించింది. రిజర్వ్ బ్యాంక్ జారీచేసిన కార్య నిర్వహణ మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు, ఈ జరిమానా విధించడమైనది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పైన తెలిపిన బ్యాంకుకు షోకాజ్ నోటీస్ జారీచేసింది. దీనికి, బ్యాంకు లిఖితపూర్వక జవాబు ఇచ్చింది. ఈవిషయమై వాస్తవాలు, బ్యాంక్ సమర్పించిన జవాబు, పరిశీలించిన తరువాత, ఉల్లంఘనలు నిరూపితమైనట్లు, అవి జరిమానా విధింపతగినవేనని రిజర్వ్ బ్యాంక్, నిర్ధారణకు వచ్చినది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2018-2019/1852 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: