<font face="mangal" size="3">రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌గా శ్రీ ఎన - ఆర్బిఐ - Reserve Bank of India
రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్గా శ్రీ ఎన్ ఎస్ విశ్వనాథన్ పదవీ స్వీకరణ
జులై 04, 2016 రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్గా శ్రీ ఎన్ ఎస్ విశ్వనాథన్ పదవీ స్వీకరణ శ్రీ ఎన్ ఎస్ విశ్వనాథన్, రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్గా పదవీ స్వీకరణ చేశారు. భారత ప్రభుత్వం జూన్ 29, 2016 న ఆయనను, రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్గా నియమించింది. ఆయన పదవీ కాలం, జులై 4, 2016 న లేక ఆతరువాత, ఆయన పదవీస్వీకరణ తేదీనుండి మూడేళ్ళవరకు, లేదా తదుపరి ఆదేశాల వరకు (ముందువచ్చే తేదీ) కొనసాగుతుంది. డిప్యూటీ గవర్నర్గా పదోన్నతికి ముందు శ్రీ విశ్వనాథన్, రిజర్వ్ బ్యాంక్ ఎక్జెక్యూటివ్ డైరెక్టర్ పదవిలో ఉన్నారు. డిప్యూటీ గవర్నర్గా ఆయన, బ్యాంకింగ్ రెగ్యులేషన్ విభాగం (DBR) కో-ఆపరేటివ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ విభాగం (DCBR), నాన్ -బ్యాంకింగ్ రెగ్యులేషన్ విభాగం ( DNBR), డిపాజిట్ ఇన్స్యూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC), ఫైనాన్షియల్ స్టెబిలిటీ యూనిట్ (FSU), ఇన్స్పెక్షన్ విభాగం (Inspection Department), రిస్క్ మానిటరింగ్ విభాగం (RMD), సెక్రటరీస్ విభాగం (Secretary's Department) పర్యవేక్షిస్తారు. కేంద్రీయ బ్యాంక్లోనే పదవి కొనసాగించిన శ్రీ విశ్వనాథన్, 1981 లో రిజర్వ్ బ్యాంక్లో చేరారు. బ్యాంకుల పర్యవేక్షణ / నియంత్రణ, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, సహకార బ్యాంకులు, కరెన్సీ నిర్వహణ, విదేశీ ముద్ర, మానవ వనరుల నిర్వహణ రంగాల్లో, వీరు ప్రవీణులు. మూడు ఏళ్ళు, మారిషస్ కేంద్రీయ బ్యాంక్ అయిన, బ్యాంక్ ఆఫ్ మారిషస్లో డైరెక్టర్, సూపర్విషన్గా (Bank of Mauritius, Director of Supervision) సెకండ్మెంట్ లో ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్, చెన్నై కార్యాలయానికి అధిపతి పదవిలో ఉన్నారు. వివిధ సమయాల్లో శ్రీ విశ్వనాథన్, మూడు ప్రభుత్వ బ్యాంకుల బోర్డ్ లలో రిజర్వ్ బ్యాంక్చే డైరెక్టర్గా నియమించ బడ్డారు. IFCI, చీఫ్ విజిలెన్స్ అధికారిగా, ఇంటర్నల్ ఆడిట్ విభాగం అధిపతిగా, పని చేశారు. ఎన్నో కమిటీలు, వర్కింగ్ గ్రూప్లు, టాస్క్ ఫోర్స్లతో ఈ యనకు అనుబంధం ఉంది. వివిధ అంతర్జాతీయ సదస్సుల్లో వీరు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఇవి : మెంబర్ ఆఫ్ పాలిసీ డెవెలప్మెంట్ గ్రూప్, BIS, Basel ( Member of the Policy Development Group, BIS, Basel); మెంబర్ ఆఫ్ మేక్రో ప్రూడెన్షియల్ పాలిసీ గ్రూప్ BIS, Basel (Member of Macro Prudential Policy Group BIS, Basel) మరియు ఎక్జెక్యూటివ్ మెంబర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ క్రెడిట్ యూనియన్ రెగ్యులేటర్స్ నెట్వర్క్ (Executive Committee Member of the International Credit Union Regulators Network) జూన్ 27, 1958 లో జన్మించిన శ్రీ విశ్వనాథన్, బెంగళూరు యూనివర్సిటీ నుండి ఆర్థిక శాస్త్రంలో MA పట్టభద్రులు. అల్పనా కిల్లావాలా పత్రికా ప్రకటన: 2016-2017/23 |