భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా శ్రీ శక్తికాంత దాస్ నియామకం
తేదీ: 12/12/2018 భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా శ్రీ శక్తికాంత దాస్ నియామకం శ్రీ శక్తికాంత దాస్, IAS, రిటైర్డ్, (భూతపూర్వ కార్యదర్శి, రెవెన్యూ మరియు ఆర్థిక వ్యవహారాల విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం) డిసెంబర్ 12, 2018 నుండి, భారతీయ రిజర్వ్ బ్యాంక్, 25 వ గవర్నరుగా పదవిని చేపట్టారు. ఈ నియామకానికి ముందు, ఆయన 15వ ఆర్థిక కమిషన్ సభ్యునిగా, మరియు జి 20, షెర్పా ఆఫ్ ఇండియాగా పనిచేశారు. శ్రీ శక్తికాంత దాస్‌గారికి గత 38 ఏళ్ళుగా, వివిధ పరిపాలనా శాఖలు నిర్వహించడంలో అపారమైన అనుభవం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో, ఆర్థిక, పన్ను విధానం, పరిశ్రమలు, మౌలిక మొ. రంగాలలో, శ్రీ దాస్, ప్రధాన పదవులు పోషించారు. భారత ప్రభుత్వం, ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆయన పనిచేసిన సుదీర్ఘకాలంలో, 8 కేంద్ర బడ్జెట్లు సమర్పించడంలో, ఆయన పాత్ర ఉంది. ప్రపంచ బ్యాంక్ (World Bank), ఏషియన్ డెవెలప్‌మెంట్ బ్యాంక్ (Asian Development Bank, ADB), న్యూ డెవెలప్‌మెంట్ బ్యాంక్ (NDB), మరియు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ (AIIB), ప్రత్యామ్నాయ గవర్నర్‌గా (Alternate Governor) కూడా శ్రీ దాస్, సేవలందించారు. ఐ ఎం ఎఫ్ (IMF), జి 20 (G 20), బి ఆర్ ఐ సి ఎస్ (BRICS) ఎస్ ఏ ఏ అర్ సి (SAARC) మొదలైన అంతర్జాతీయ వేదికలు / సదస్సులలో ఆయన ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించారు. శ్రీ శక్తికాంత దాస్, సైంట్ స్టీవెన్స్ కాలేజ్, ఢిల్లీ విశ్వవిద్యాలయంనుండి, పోస్ట్ గ్రాడ్యుఏట్ పట్టా పొందారు. జోస్ జె కత్తూర్ పత్రికా ప్రకటన: 2018-2019/1362 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: