<font face="mangal" size="3">క్రొత్త కార్యపాలక నిర్దేశకులుగా (Executive Director) శ్రీ సు - ఆర్బిఐ - Reserve Bank of India
క్రొత్త కార్యపాలక నిర్దేశకులుగా (Executive Director) శ్రీ సుదర్శన్ సెన్ పదవీస్వీకారం
జులై 04, 2016 క్రొత్త కార్యపాలక నిర్దేశకులుగా (Executive Director) శ్రీ సుదర్శన్ సెన్ పదవీస్వీకారం శ్రీ సుదర్శన్ సేన్, రిజర్వ్ బ్యాంక్ నూతన కార్యపాలక నిర్దేశకులుగా (Executive Director), ఈ రోజు పదవీ స్వీకారంచేశారు. ఈయన, బ్యాంకింగ్ రెగ్యులేషన్ విభాగం, కో-ఆపరేటివ్ బ్యాంకింగ్ విభాగం, నాన్-బ్యాంకింగ్ రెగ్యులేషన్ విభాగాలను పర్యవేక్షిస్తారు. కేంద్రీయ బ్యాంక్‌లోనే పదవి కొనసాగించిన ఈయన, బ్యాంకుల పర్యవేక్షణ/నియంత్రణలో ఎంతో అనుభవం ఉన్నవారు. కార్యపాలక నిర్దేశకులుగా పదవి చేపట్టే ముందు బ్యాంకింగ్ రెగ్యులేషన్ విభాగానికి అధిపతిగా ఉన్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్, అహ్మదాబాద్ కార్యాలయం, ప్రాంతీయ నిర్దేశకులుగా కూడా పనిచేశారు. శ్రీ సుదర్శన్ సేన్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లో, బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం నుండి, MBA పట్టభద్రులు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి, గణిత శాస్త్రం లో మాస్టర్స్ పట్టా కూడా కలిగి ఉన్నారు. అల్పనా కిల్లావాలా పత్రికా ప్రకటన : 2016-2017/29 |