<font face="mangal" size="3">శ్రీ వినాయక్ సహకారి బ్యాంక్ లి., అహమ్మదాబాద్ (&# - ఆర్‌బిఐ - Reserve Bank of India
శ్రీ వినాయక్ సహకారి బ్యాంక్ లి., అహమ్మదాబాద్ (గుజరాత్) (నాన్-షెడ్యూల్డ్ యు సి బి) - జరిమానా విధింపు
తేదీ : జులై 24, 2018 శ్రీ వినాయక్ సహకారి బ్యాంక్ లి., అహమ్మదాబాద్ (గుజరాత్) (నాన్-షెడ్యూల్డ్ యు సి బి) - జరిమానా విధింపు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 47(A) 1 (సెక్షన్ 46 (4) తో కలిపి), క్రింద తమకు దఖలుపరచిన అధికారాలతో, భారతీయ రిజర్వ్ బ్యాంక్, వినాయక్ సహకారి బ్యాంక్ లి. అహమ్మదాబాద్ (గుజరాత్) (నాన్-షెడ్యూల్డ్ యు సి బి) పై రూ. 5,00,000 (రూపాయిలు ఐదు లక్షలు) నగదు జరిమానా విధించినది. రిజర్వ్ బ్యాంక్, సూపర్‌వైజరీ ఫ్రేమ్‌వర్క్ క్రింద జారీచేసిన ఆదేశాలు, కె సి వై / ఏ ఎమ్ ఎల్ నిబంధనలు, ఉల్లంఘించినందువల్ల, ఈ జరిమానా విధించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్, వినాయక్ సహకారి బ్యాంక్‌యొక్క మార్చ్ 31, 2017 తేదీనాటి ఆర్థిక స్థితి తనిఖీలో వెల్లడయిన అంశాల ఆధారంగా, షోకాజ్ నోటీస్ (ఎస్ సి ఎన్)జారీ చేసినది. దీనికి జవాబుగా బ్యాంక్, లిఖితపూర్వక జవాబు మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అహమ్మదాబాద్, ఉన్నతోద్యోగుల కమిటీకి, ప్రత్యక్ష విన్నపములు సమర్పించినది. ఈ విషయమై నిజానిజాలు, బ్యాంకు సమర్పించిన జవాబు పరిశీలించిన పిమ్మట, ఉల్లంఘనలు నిరూపించబడినట్లు, అవి నగదు జరిమానా విధించదగినవేననీ, రిజర్వ్ బ్యాంక్ నిర్ధారణకు వచ్చినది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2018-2019/208 |