<font face="mangal" size="3">SBNల కొర‌కు బ్యాంకుల‌కు వ‌చ్చే క‌స్ట‌మ‌ర్ల వేల&# - ఆర్బిఐ - Reserve Bank of India
SBNల కొరకు బ్యాంకులకు వచ్చే కస్టమర్ల వేలిపై చెరిగిపోని ఇంకు గుర్తును పెట్టే విషయంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)
RBI/2016-17/133 నవంబర్ 15, 2016 ద ఛైర్మన్/మేనేజింగ్ డైరెక్టర్/చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డియర్ సర్, SBNల కొరకు బ్యాంకులకు వచ్చే కస్టమర్ల వేలిపై చెరిగిపోని ఇంకు గుర్తును పెట్టే విషయంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) దయచేసి పైన పేర్కొన్న అంశానికి సంబంధించి మేము నవంబర్ 08, 2016న జారీ చేసిన సర్క్యులర్ నెం.DCM (Plg) No.1226/10.27.00/2016-17ను గమనించగలరు. వివిధ వర్గాల నుంచి అందిన అభిప్రాయాలను ను అనుసరించి స్పెసిఫైడ్ బ్యాంకు నోట్ల (SBN) మార్పిడి విషయంలో ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ను అనుసరించాల్సిన అవసరాన్ని గుర్తించడం జరిగింది. తదనుగుణంగా బ్యాంకులు ఈ క్రింది చర్యలను తీసుకోవలసినదిగా కోరడమైనది: 1. SBNలను మార్చుకొనే విషయంలో సంబంధిత బ్యాంకు శాఖలు లేదా పోస్ట్ ఆఫీసులు కస్టమర్ యొక్క కుడి చేతి చూపుడు వేలుపై అతను/ఆమె పాత కరెన్సీ నోట్లను ఒకసారే మార్చుకొన్నాడని గుర్తించడానికి చెరిగిపోని ఇంకు గుర్తును పెట్టాలి. 2. ఈ చెరిగిపోని ఇంకును ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) బ్యాంకుల సమన్వయం మరియు భారతీయ రిజర్వ్ బ్యాంక్ తో సంప్రదింపుల అనంతరం బ్యాంకులు/పోస్ట్ ఆఫీసులకు సరఫరా చేస్తారు. 3. మొదట ఈ విధానాన్ని మెట్రో నగరాలలో ప్రారంభించి, క్రమంగా దానిని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. 4. ప్రతి బ్యాంకు శాఖకు నల్లని చెరిగిపోని 5ఎంఎల్ ఇంకు బాటిళ్లను సరఫరా చేస్తారు. ఇంకుతో గుర్తు పెట్టడానికి వీలుగా ఆ బాటిల్ మూతలోనే బ్రష్ కూడా ఉంటుంది. 5. బ్యాంకు క్యాషియర్ లేదా బ్యాంకు అనుమతించిన ఏ అధికారి అయినా కస్టమర్ కు నోట్లను ఇస్తున్న సందర్భంగా ఆ చెరిగిపోని ఇంకుతో వారి వేలిపై గుర్తు పెడతారు. ఈ క్రమంలో కొన్ని సెకెండ్లు గడిచిపోయి, ఇంకు ఎండిపోయి, ఆ ఇంకు గుర్తును తొలగించడం నివారించబడుతుంది. 6. ఎడమ చేతి చూపుడు వేలు లేదా వేరే వేలిపై తొలగించడానికి వీలులేని ఇంకు గుర్తు ఉంటే వాటి కారణంగా పాత నోట్ల మార్పిడికి నిరాకరించరాదు. మీ విశ్వసనీయులు, (పి.విజయ కుమార్) |