<font face="mangal" size="3">సార్వభౌమ పసిడి బాండ్లు 2017-18 సీరీస్-III</font> - ఆర్బిఐ - Reserve Bank of India
సార్వభౌమ పసిడి బాండ్లు 2017-18 సీరీస్-III
అక్టోబర్ 06, 2017 సార్వభౌమ పసిడి బాండ్లు 2017-18 సీరీస్-III భారత ప్రభుత్వ నోటిఫికేషన్ F. No.4(25) – B/(W&M)/2017 మరియు భారతీయ రిజర్వ్ బ్యాంక్ సర్కులర్ IDMD.CDD.No.929/14.04.050/2017-18 ది అక్టోబర్ 06, 2017 ప్రకారం సార్వభౌమ పసిడి బాండ్ల పథకం విక్రయాలు (సబ్ స్క్రిప్షన్) ప్రతీ వారం సోమ వారం నుంచి బుధవారం వరకు, అక్టోబర్ 09, 2017 న ప్రారంభమై డిసెంబర్ 27, 2017 వరకు కొనసాగుతాయి. ఒక వారంలో దాఖలైన దరఖాస్తులకు సెటిల్‌మెంట్ తదుపరి వారం తొలి పనిదినం రోజున జరుగుతుంది. సబ్ స్క్రిప్షన్ కాలం అక్టోబర్ 09, 2017 నుండి అక్టోబర్ 11, 2017 వరకు (వారం) దాఖలైన దరఖాస్తులకు, సెటిల్‌మెంట్ తేదీఐన అక్టోబర్ 16, 2017 న జారీచేసే బాండ్ల విలువ, ఇండియన్ బులియన్ మార్కెట్ మరియు జ్యాయలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ వారు ఫై వారానికి ముందు వారం చివరి మూడు పనిదినాల అంటే అక్టోబర్ 04 - 06, 2017 వరకు నిర్ధారించిన 999 స్వచ్ఛత కల్గిన బంగారం యొక్క సాధారణ సగటు ముగింపు ధర ఆధారంగా, గ్రాము ఒకటికి రూ.2956 (రెండువేల తొమ్మిదవొందల యాభైఆరు రూపాయలు) గా ఉండనుంది. ఐతే, ఆన్‌లైన్లో దరఖాస్తు చేసి, చెల్లింపులను సైతం డిజిటల్ పద్ధతిలో చేసేవారికి గ్రాముకు రూ.50 మేర డిస్కౌంట్ ఇవ్వాలని ఆర్‌బీఐతో చర్చించిన అనంతరం భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తరహా మదుపర్లకు పసిడి బాండ్ జారీ ధర రూ.2906 (రెండువేల తొమ్మిదవొందల ఆరు రూపాయలు) గా ఉండనుంది. అజిత్ ప్రసాద్ ప్రెస్ రిలీజ్: 2017-2018/958. |