RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78511562

సార్వభౌమ పసడి బాండ్లు – డీ-మటీరియలైజేషన్‌ (Sovereign Gold Bonds – dematerialisation)

తేదీ: ఆగస్ట్ 08, 2017

సార్వభౌమ పసడి బాండ్లు – డీ-మటీరియలైజేషన్‌
(Sovereign Gold Bonds – dematerialisation)

భారతీయ రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వంతో సంప్రదించి ఇంతవరకు తొమ్మిది విడతలుగా, 6030 కోట్ల విలువకు, సార్వభౌమ పసడి బాండ్లను జారీచేసింది. ఈ బాండ్లు భౌతికంగాగానీ, ఖాతారూపంలోగాని (డీమ్యాట్, demat form) ఉంచుకొనే స్వేఛ్ఛ మదుపరులకు కల్పించింది.

డీమటీరియలైజేషన్‌ కొరకై వచ్చిన విజ్ఞప్తులపై, చాలావరకు, విజయవంతంగా చర్య తీసుకోబడింది. అయితే, కొన్ని విజ్ఞప్తులపై, పేర్లు మరియు PAN నంబర్లలో తేడాలవల్ల, డీమ్యాట్ ఖాతాలు అచేతనంగా లేదా మూసివేయబడి ఉండడం వల్ల, తదితర కారణాలవల్లా, చర్య తీసికొనబడలేదు. అటువంటి విజ్ఞప్తుల జాబితా, ఇప్పుడు వెబ్‌సైట్ https://soveriegngoldbonds.rbi.org.in లో ఉంచబడినది. ఈ సమాచారం విడతల వారీగా, స్వీకరించిన కార్యాలయం (Receiving Office), మదుపరుల గుర్తింపు (Investoer ID) మరియు బాండ్ డీమటీరియలైజేషన్‌ చేయలేకపోవడానికి కారణాలతో సహా ఇవ్వబడినది. ఈ జాబితా చూసి, మదుపరులు, వారి మదుపరుల గుర్తింపు (Investor ID) దీనిలో ఉన్నదేమో తెలిసికోవచ్చు. అన్ని రిసీవింగ్ కార్యాలయాలు, వారి ఖాతాదార్లకు చెందిన సమాచారం తెలిసికొని, వారితో చర్చించి, తగిన సవరణలు చేయవలెను. సవరణలకై, రిజర్వ్ బ్యాంక్, ఇ-కుబేర్ విండో (modification window in the e-Kuber application of the Reserve Bank of India) తెరిచి ఉంటుంది.

ఈ మధ్య సమయంలో నెలకొన్న అనిశ్చిత స్థితిలోకూడా, సార్వభౌమ పసిడి బాండ్లు, రిజర్వ్ బ్యాంక్ పుస్తకాల్లో చూపబడి, నియమానుసారంగా సేవలకు అర్హమౌతాయని తెలియచేస్తున్నాము.

అనిరుద్ధ డి జాధవ్
అసిస్టెంట్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2017-2018/390

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?