<font face="mangal" size="3">సార్వభౌమ పసిడి బాండ్ల పథకం 2018-2019, కార్య నిర్వహణ మ - ఆర్బిఐ - Reserve Bank of India
సార్వభౌమ పసిడి బాండ్ల పథకం 2018-2019, కార్య నిర్వహణ మార్గదర్శక సూత్రాలు
RBI/2018-19/58 తేదీ: అక్టోబర్ 08, 2018 చైర్‌మన్ & మానేజింగ్ డైరెక్టర్ అయ్యా / అమ్మా, సార్వభౌమ పసిడి బాండ్ల పథకం 2018-2019, సార్వభౌమ పసిడి బాండ్లపై, భారత ప్రభుత్వ నోటిఫికేషన్ F.No.4(22)-W&M/2018 మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్క్యులర్ IDMD.CDD.No. /14.04.050/2018-19 తేదీ అక్టోబర్ 08, 2018, దయచేసి చూడండి. తరచుగా వచ్చే సందేహాలకు జవాబులు, మా వెబ్‌సైట్ www.rbi.org.in లో ఇవ్వబడ్డాయి. ఈ పథకానికి సంబంధించిన కార్య నిర్వహణ మార్గదర్శక సూత్రాలు (Operational Guidelines) ఈ క్రింద ఇవ్వబడ్డాయి: 1. దరఖాస్తు మదుపరులనుండి దరఖాస్తులు, పెట్టుబడి స్వీకరించే వారాలలో, బ్యాంక్ శాఖలలో స్వీకరించబడతాయి (బ్యాంకు పనివేళల్లో). సంపూర్ణంగాలేని దరఖాస్తులు తిరస్కరించబడతాయి గనుక, స్వీకరించే కార్యాలయాలు, దరఖాస్తు అన్నివిధాలుగా సంపూర్ణంగా ఉందని రూఢిపరచుకోవలెను. అవసరమయితే, దరఖాస్తుదారునుండి అదనపు వివరాలు కోరవచ్చు. ఖాతాదారులకు మెరుగైన సేవలందించుటకు, కార్యాలయాలు, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయుటకు ఏర్పాట్లు చేయవలెను. 2. ఉమ్మడి హక్కు (joint holding) మరియు నామినేషన్: అనేకమంది ఉమ్మడి హక్కుదారులు/మొదటి హక్కుదారుని నామినీలు, అనుమతించబడతారు. దరఖాస్తుదారుల వద్దనుండి వాడుక ప్రకారం అవసరమైన వివరాలు పొందవలెను. మరణించిన మదుపుదారుకు తాను నామినీ అయినట్లయితే, వ్యక్తిగత నాన్-రెసిడెంట్ ఇండియన్, క్రింది షరతులకు లోబడి, నామినీగా తనపేరుపై సెక్యూరిటీని, బదిలీ చేయించుకోవచ్చు: i. నాన్-రెసిడెంట్ ఇండియన్ సెక్యూరిటీని, గడువు ముందు తిరిగి చెల్లించబడేవరకు లేక గడువు పూర్తి అయేవరకు దానిని అట్టిపెట్టుకోవలెను. ii. వడ్డీ మరియు గడువు తీరిన సెక్యూరిటీపై చెల్లించిన మొత్తం, విదేశమునకు బదిలీచేయరాదు (non-repatriable). 3. 'మీ వినియోగదారుని తెలుసుకోండి' (కె వై సి, KYC) ఆవశ్యతలు ప్రతి దరఖాస్తు, ఆదాయపన్ను శాఖ దరఖాస్తుదారున(ల)కు కేటాయించిన 'పాన్’ (PAN) సంఖ్య కలిగి ఉండవలెను. ఇంతకు ముందు ఎస్ జి బి, ఐ ఐ ఎన్ ఎస్ సి-సి మదుపుచేసిన కారణంగా, దరఖాస్తుదారు, మదుపరుల గుర్తింపు ('ఇన్‌వెస్టర్ ఐ డి') కలిగి ఉన్నాడేమో తెలుసుకొని, అయినచో, పెట్టుబడులు, అట్టి ప్రత్యేకమైన 'ఇన్‌వెస్టర్స్ ఐ డితో' మాత్రమే చేయవలెను. 4. రద్దు బాండ్ల జారీ గడువు ముగిసే తేదీలోపు (అనగా, పెట్టుబడి స్వీకరించే వారంలో శుక్రవారం వరకు), దరఖాస్తు రద్దు చేసుకొనవచ్చును. పసిడి బాండ్లు కొనుటకు చేసిన దరఖాస్తు, పాక్షికంగా రద్దుచేయుట అనుమతించబడదు. 5. తాత్కాలిక హక్కు (లీన్, lien) బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలుగనుక, లీను మార్క్ చేయుటకు, ప్రభుత్వ సెక్యూరిటీల చట్టం, 2006 యొక్క నిబంధనలు వర్తిస్తాయి. 6. ప్రాతినిధ్య ఒప్పందం దరఖాస్తులు స్వీకరించే కార్యాలయాలు, ఎన్ బి ఎఫ్ సి, ఎన్ ఎస్ సి ప్రతినిధులను, ఇతరులను, వారితరఫున దరఖాస్తులను స్వీకరించుటకు ఏజంట్లుగా నియమించవచ్చును. బ్యాంకులు, వారితో ఒప్పందాలు, టై-అప్‌లు చేసుకోవచ్చు. బాండ్ల వితరణకు, బ్యాంకులకు, వారి సేకరించిన ప్రతి వంద రూపాయిల దరఖాస్తులపై, ఒక రూపాయి చొప్పున కమిషన్ లభిస్తుంది. బ్యాంకులు, దీనిలో 50%, ఏజంట్లు, సబ్-ఏజంట్లతో, వారిద్వారా సేకరించిన మొత్తానికై పంచుకోవలెను. 7. ఆర్ బి ఐ, ఇ-కుబేర్ వ్యవస్థద్వారా బాండ్ల జారీ ప్రక్రియ పెట్టుబడిచేయుటకు, సార్వభౌమ పసిడి బాండ్లు, స్వీకరణ కార్యాలయాలలో, ఆర్ బి ఐ, ఇ-కుబేర్ వ్యవస్థద్వారా లభ్యమౌతాయి. INFINET లేదా అంతర్జాలం ద్వారా, ఇ-కుబేర్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ఈ కార్యాలయాలు, దరఖాస్తుల వివరాలు (data) పూరించవలెను లేదా అన్ని దరఖాస్తులు కలిపి అప్‌లోడ్ చేయవచ్చు. అనుకోని పొరపాట్లు దొరలకుండా శ్రద్ధ వహించవలెను. దరఖాస్తు అందిన వెంటనే వారికి ధృవీకరణ పంపబడును. అదనంగా, వారివద్దగల వివరాలు నవీకరించుకొనుటకు వీలుగా, ఒక దరఖాస్తుల ధృవీకరణ జాబితా (confirmation scroll) పంపబడును. బాండ్లు జారీచేసే తేదీన, దరఖాస్తుదారుని / ప్రధాన దరఖాస్తుదారుని పేర, సర్టిఫికేట్ ఆఫ్ హోల్డింగ్ తయారుచేయబడుతుంది. స్వీకరణ కార్యాలయాలు, వాటిని డౌన్ లోడ్ చేసి, ముద్రించగలరు. ఇ-మైల్ అడ్రెస్ తెలియచేసిన వారికి, సర్టిఫికేట్ ఆఫ్ హోల్డింగ్, ఇ-మైల్‌ద్వారా పంపబడును. తరువాత, డిపాజిటరీలు, దరఖాస్తుదారు సమర్పించిన వివరాలు, తమవద్దగల వివరాలతో సరిచూసి సెక్యూరిటీలను డి-మ్యాట్ ఖాతాకు జమచేస్తాయి. 8. సర్టిఫికేట్ ఆఫ్ హోల్డింగ్ ముద్రణ హోల్డింగ్ సర్టిఫికేట్ A4 సైజ్, 100 GSM కాగితంపై, రంగులలో ముద్రించవలెను. 9. తదుపరి సేవలు, చర్యలు దరఖాస్తులు స్వీకరించిన కార్యాలయాలు, దరఖాస్తుదారుని, తమస్వంత ఖాతాదారుగా భావించి బాండుకు సంబంధించి తదుపరి సేవలను అందించవలెను. ఉదా: సంపర్క వివరాలు నవీకరించుట, గడువుతేదీ ముందే చెల్లింపునకు అభ్యర్థన అంగీకరించుట, మొ.వి. దరఖాస్తు తీసుకొన్న కార్యాలయాలు, దరఖాస్తులను బాండ్ల గడువు ముగిసేవరకు లేక తిరిగిచెల్లించేవరకు, భద్రపరచవలెను. 10. బాండ్లతో లావాదేవీలు (tradability) బాండ్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన తేదీన ట్రేడ్ చేయవచ్చు. (డిపాజిటరీలలో, డి-మ్యాట్ రూపంలోగల బాండ్లు మాత్రమే స్టాక్ ఎక్స్చేంజిలలో ట్రేడ్ చేయవచ్చని, ఇచ్చట గమనించాలి) 11. సంపర్క వివరాలు ప్రశ్నలు / వివరణలకొరకు ఈ క్రింది విధంగా ఇ-మైల్ పంపవచ్చు: (a) సార్వభౌమ పసిడి బాండ్లకు సంబంధించి: ఇ-మైల్ పంపుటకు ఇచ్చట నొక్కండి. (b) ఐ టి కి సంబంధించి: ఇ-మైల్ పంపుటకు ఇచ్చట నొక్కండి. మీ విశ్వాసపాత్రులు, (షైని సునిల్) |